ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌!

AIRTEL
AIRTEL


టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ను అందిస్తుంది. రూ.199 ఆపైన రీచార్జ్‌ చేసుకుంటే నార్టన్‌ మొబైల్‌ సెక్యూరిటీ యాంటీ వైరస్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నది. ఇప్పటికే ఈ ఆఫర్‌కు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు కస్టమర్లకు వచ్చాయి. రీచార్జ్‌ చేసుకున్న కస్టమర్లు మై ఎయిర్‌టెల్‌ యాప్‌లోకి వెళ్లి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అన్‌సేఫ్‌ యాప్‌, ఆన్‌లైన్‌ ప్రైవసి, యాంటీ ఫిషింగ్‌ వెబ్‌ ప్రొటెక్షన్‌, మాల్‌వేర్‌ ప్రొటెక్షన్‌, ఫోన్‌ లాస్‌, సేఫ్‌ బ్రౌజింగ్‌ వంటి ఫీచర్లను ఈ యాంటీ వైరస్‌లో పొందవచ్చు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/