మరింత భారం కానున్న విమానయానం

aeroplane
aeroplane

న్యూఢిల్లీ: విమానంలో ఇకపై ప్రయాణించే వారికి నగదు వడ్డన తప్పనట్లేఉంది. ఇకపై ప్రయాణికులు ప్యాసింజర్‌ సర్వీస్‌ ఫీజు(పిఎస్‌ఎఫ్‌)కు బదులుగా ఏవియేషన్‌ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్‌ఎఫ్‌) చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుల సేవల రుసుం కంటే భద్రతా రుసుము ఎక్కువగా ఉండటం గమనార్హం.
ప్రస్తుతం టికెట్‌ ధరతో పాటే ప్యాసింజర్‌ సేవల కింద కొంత మొత్తాన్ని ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. భారత కరెన్సీతో టికెట్‌ కొనుగోలు చేసే వారికి రూ. 130, విదేశీ కరెన్సీతో టికెట్‌ కొనేవారికి 3.25 డాలర్లు చొప్పున పీఎస్‌ఎఫ్‌ చార్జ్‌ చేస్తున్నారు. ఇకపై ప్యాసింజర్‌ సర్వీస్‌ ఫీజుకు బదులుగా ఏవియేషన్‌ సెక్యూరిటీ ఫీజు ఉంటుందని విమానయానశాఖ స్పష్టం చేసింది. తాజా మార్పులతో ప్రయాణికులకు టికెట్‌ ఖర్చులు పెరగనున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/