జెట్‌ రూట్లలో ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌ సర్వీసులు

న్యూఢిల్లీ: జెట్‌ఎయిర్‌వేస్‌ సేవలు నిలిచిపోవడంతో ఆ సంస్థ కొనసాగించిన రూట్లలో కొత్త విమానాలను ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌లు నడిపేందుకు సిద్ధం అవుతున్నాయి. కొత్త ఎయిర్‌ ఇండియా విమానాలు వచ్చేనెలనుంచి సర్వీసులు ప్రారంభించనుండగా స్పైస్‌జెట్‌ మాత్రం ఈ నెల చివరివారంనుంచే కొత్తరూట్లలో సేవలు ప్రారంభించనున్నట్లు తేలింది. ఎయిర్‌ ఇండియా బుధవారమే దుబాయి రూటుకు మరిన్ని విమానాలు వెల్లడించింది. స్పైస్‌జెట్‌ కూడా 20 కొత్త దేశీయ విమానసర్వీసులుప్రకటించింది. దేశీయ అంతర్జాతీయ రూట్లలోకూడా ఈ రెండుసంస్థలు జెట్‌ ఎయిర్‌వేస్‌ నిలిపివేసిన రూట్లలో సర్వీసులు నడపాలని నిర్ణయించాయి. ఎయిర్‌ఇండియా వారానికి 3500 అదనపు సీట్లను ముంబయి, దుబాయి, ఢిల్లీ దుబాయి సెక్షన్లలో నడపాలనినిర్ణయించింది. జెట్‌ విమానాలునిలిచిపోవడంతో అంతర్జాతీయ రూట్లలో రద్దీ ఎక్కువపెరిగింది. పలితంగా ప్రభుత్వం ఈరెండుసంస్థలకు రూట్లను కేటాయించింది. జాతీయ విమానయానసంస్థ అయిన ఎయిర్‌ఇండియా జెట్‌ కోటాలో అంతర్జాతీయ సీట్లను ఎక్కువ సాధిస్తే ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌, విస్తారా వంటివి కొత్త రూట్లపరంగా లబ్దిపొందాయి. గత ఏడాది అంతర్జాతీయ కార్యకలాపాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ భారత్‌లోనే అతిపెద్ద విమాన ఆపరేటర్‌గా నిలిచింది. 13.8 శాతం మార్కెట్‌వాటా సాధించింది. అయితే జెట్‌ నిలిపివేతకారణంగా అంతర్జాతీయ రూట్లలో 15-20శాతం దరలు పెరిగిపోయాయి. ఇక దుబాయితోపాటు ఎయిర్‌ఇండియా బహుళ రూట్లలో కొత్త విమానాలు ప్రవేశపెట్టింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/