మళ్లీ ఆయనే మారుతి బాస్‌

Kenichi Ayukawa
Kenichi Ayukawa

ముంబై, : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతిసుజుకి ఎండి, సిఇఒగా మళ్లీ కెనిచి అయుకవ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఒ బోర్డు సమావేశంలో కెనిచిని తిరిగి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కెనిచి నియామకం 2019 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 2013 మార్చిలో ఆయన సిఇఒగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా అవకాశంతో మూడోసారి కూడా మరో మూడేళ్లపాటు కెనిచి సిఎండిగా కొనసాగనున్నారు.

మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/