ఆదిత్యబిర్లా కేపిటల్‌ రూ.2100 కోట్లు సమీకరణ

aditya birla
aditya birla

ముంబయి, ఆదిత్యబిర్లా కేపిటల్‌ ప్రాథమికంగా ఈక్విటీ వనరుల మూలధనం కింద రూ.2100 కోట్లు సమీకరించింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, యాడ్వెంట్‌ సంస్థలు ఆదిత్యబిర్లా కేపిటల్‌లో రూ.1100 కోట్లకు వాటాలను కొనుగోలుచేసాయి. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, యాడ్వెంట్‌ ఇంటరేషనల్‌ కంపెనీలు భారీ వాటాలతోనే ముందుకువచ్చాఇయ. యాడ్వెంట్‌ 1000 కోట్లు, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ 100 కోట్లకు వాటాలు కొనుగోలుచేస్తోంది. మరో వెయ్యికోట్లు ఈ ఇద్దరు ప్రమోటర్లు గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ 770 కోట్లు,ఇతర గ్రూప్‌సంస్థలు 230 కోట్లు మూలధన నిదులు అందిస్తున్నాయి.ఈ లావాదేవీలదావ్ర ఆఆదిత్యబిర్లా కేపిటల్‌ మొత్తం ప్రాతమిక ఈక్విటీ మూలధనం రూ.2100 కోట్లు సమీకరిస్తోంది. మార్క్వీ ఇన్వెస్టర్లకు ప్రాధాన్యతా కేటాయింపులు జరుపుతుంది. వీటిలోప్రమోటర్లు, ప్రమోటర్‌గ్రూప్‌సంస్థలుసైతం ఉన్నాయి. ఈక్విటీ వాటాలు ఒక్కొక్క వాటాకు రూ.100 చొప్పున సమీకరిస్తారు. ఎబిసిఎల్‌ ముగింపుధర 90.40రూపాయలకంటే 10.62శాతం ఎక్కువ ఉంది. ఇందుకోసం ఇపుడు చట్టపరమైన అనుమతులు సంస్థకు రావాల్సి ఉంది. రూ.100 వాటాధర 5.79శాతం ప్రీమియం ధరకుఇస్తున్నట్లు వెల్లడించింది. సెబి జారీచేసిన ఐసపిడిఆర్‌ నిబంధనలకు అనుగుణంగానే వాటాల కేటాయింపు ఉంటుందని అంచనా. ఇందుకోసం ఆదిత్యబిర్లా కేపిటల్‌ జోమేయి ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందానికి వచ్చింది. యాడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఈ కంపెనీ పనిచేస్తోంది. గ్లోబల్‌రపైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లలో అతిపెద్ద ప్రముఖసంస్థగా నిలిచింది. అలాగే పిఐ ఆపర్చునిటీస్‌ఫండ్‌ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. ఈ జారీ పూర్తయిన వెంటనే యాడ్వెంట్‌ తన అనుబంద సంస్థద్వారా ఎబిసిఎల్‌లో 4.15శాతం వాటా కలిగి ఉంటుంద.ఇ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ తన అనుబంద సంస్థద్వారా సుమారు 4.11శాతం ఎబిసిఎల్‌ వాటాలను కొనుగోలుచేసినట్లవుతుంది. ప్రమోటర్‌, ప్రమోటరు గ్రూప్‌సంస్థలు 70.54శాతం ఎబిసిఎల్‌లో వాటాలు పొంది ఉంటాయి. ఎబిసిఎల్‌కు నిర్వహణాస్తులు మూడులక్షలకోట్లకుపైబడి ఉన్నాయి. ఎన్‌బిఎఫ్‌సి రుణపరపతిబుక్‌ 62 వేల కోట్లవరకూ ఉంది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ బిజినెస్‌,తోపాటుస్థూల ప్రీమియం ఎనిమిదివేల కోట్లకుపైబడి ఉంది. ఎబిసిఎల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అజ§్‌ుశ్రీనివాసన్‌మాట్లాడుతూ ఈ పెట్టుబడులు ఎబిసిఎల్‌గ్రూప్‌ ఆర్ధిక వ్యవహారాలనుప్రభావితంచేస్తుందని తెలిపారు. ఈ భాగస్వామ్యంతో గ్లోబల్‌ ఇన్వెస్టర్లు వంటివారు కంపెనీపరిధిలోనికి వచ్చినట్లయిందన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/