ఆదిత్యబిర్లా కేపిటల్‌ రూ.2100 కోట్ల సమీకరణ

Aditya birla
Aditya birla


ముంబయి: ఆదిత్యబిర్లా కేపిటల్‌ సంస్థ 2100 కోట్ల నిధులను ప్రాధాన్యతా షేర్ల కేటాయింపుతో నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించింది. జోమేఇ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థకు ఈ వాటాలను జారీచేస్తోంది. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోటర్‌ అయిన జోమేయితోపాటు పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌కు సైతం షేర్లను కేటాయిస్తోంది. ఆదిత్యబిర్లా గ్రూప్‌లోని కీలకమైన సంస్థ ప్రస్తుతానికి 1000 కోట్ల మూలధన వనరులు అవసరమని భావిస్తోంది. 770 కోట్లు జోమేయి ఇన్వెస్ట్‌మెంట్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి సేకరిస్తుండగా పదికోట్లు వాటాలు, మరో 7.70 కోట్ల పూర్తి అధీకృత చెల్లింపు వాటాలను వందరూపాయలు చపొ2న జోమేయి, గ్రాసిమ్‌లకు విడుదల చేస్తోంది. ఎబిసిఎల్‌ కంపెనీ 230 కోట్లు, మరో వందకోట్ల రూపాయలను ప్రమోటర్‌గ్రూప్‌ పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌-1నుంచి సేకరిస్తోంది కంపెనీ 2.30 కోట్లమేర వాటాలు జారీచేస్తుంగా వాటిలో కోటికిపైగా పూర్తి అధీకృత చెల్లింపు ఈక్విటీవాటాలను రూ.100 చొప్పున ప్రమోటర్‌గ్రూప్‌, పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌-1కు కేటాయిస్తున్నది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/