ఆదిత్యబిర్లా కేపిటల్‌ రూ.2100 కోట్ల సమీకరణ

Aditya Birla Capital
Aditya Birla Capital

ముంబయి: ఆదిత్యబిర్లా కేపిటల్‌ సంస్థ 2100 కోట్ల నిధులను ప్రాధాన్యతా షేర్ల కేటాయింపుతో నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించింది. జోమేఇ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థకు ఈ వాటాలను జారీచేస్తోంది. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోటర్‌ అయిన జోమేయితో పాటు పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌కు సైతం షేర్లను కేటాయి స్తోంది. ఆదిత్యబిర్లా గ్రూప్‌లోని కీలకమైన సంస్థ ప్రస్తుతానికి 1000 కోట్ల మూలధన వనరులు అవసరమని భావిస్తోంది. 770 కోట్లు జోమేయి ఇన్వెస్ట్‌మెంట్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి సేకరిస్తుండగా పదికోట్లు వాటాలు, మరో 7.70 కోట్ల పూర్తి అధీకృత చెల్లింపు వాటాలను వంద రూపాయలు చపొ2న జోమేయి, గ్రాసిమ్‌లకు విడుదలచేస్తోంది. ఎబిసిఎల్‌ కంపెనీ 230 కోట్లు, మరో వందకోట్ల రూపాయలను ప్రమోటర్‌ గ్రూప్‌ పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌-1నుంచి సేకరిస్తోంది కంపెనీ 2.30 కోట్ల మేర వాటాలు జారీచేస్తుండగా వాటిలో కోటికిపైగా పూర్తి అధీ కృత చెల్లింపు ఈక్విటీవాటాలను రూ.100 చొప్పున ప్రమోటర్‌గ్రూప్‌, పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌-1కు కేటాయిస్తున్నది. ఈ వాటాల కేటా యింపు తర్వాతగ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ప్రమోటర్‌గ్రూప్‌ వాటాలు 54.29 శాతం,16.26 శాతంగా ఉంటాయి. జోమేయి, పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌-1 సంస్థలు 4.15శాతం, 3.86శాతం వాటాలతో ఉంటాయి. ఇందుకోసం ఎబిసిఎల్‌ ఇప్పటికే అత్యవసర సర్వసభ్యసమావేశం వచ్చే అక్టోబరు ఐదవ తేదీ నిర్వహిస్తోంది. ఈ ఈక్విటీ వాటాల ప్రాధాన్యతా కేటాయింపులను ఆమోదిం చుకునేందుకు యత్నిస్తోంది. సుమారు 3 లక్షల కోట్లకుపైబడ ఇనిర్వహణ ఆస్తులున్న ఆదిత్య బిర్లాగ్రూప్‌ రుణపరపతి బుక్‌ 61,900 కోట్లకు పైబడి ఉంది. ఇక అనుబంధసంస్థలు, జాయింట్‌ వెంచర్లుసైతం మంచి లాభదాయక స్థితిలోనే ఉన్నాయి. కంపెనీ నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌, హౌసింగ్‌ఫైనాన్స్‌, మ్యూచువల్‌ఫండ్‌, బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, సాధారణబీమా బ్రోకింగ్‌, స్టాక్‌ సెక్యూరిటీల బ్రోకింగ్‌ వ్యాపారాలు నిర్వహిస్తోంది.