జిఎంఆర్‌ ఛత్తీస్‌ఘర్‌ అదాని పరం!

GMR power
GMR power


న్యూఢిల్లీ: ఆదానిపవర్‌ ఛత్తీస్‌ఘర్‌లోని జిఎంఆర్‌ ఛత్తీస్‌ఘర్‌ ఎనర్జీని కొనుగోలుచేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకర్ల కూటమి రికవరీ ప్రణాళికకు ఆమోదం తెలపడంతో ఆదానిపవర్‌ జిఎంఆర్‌సంస్థ కొనుగోలుకు ముందుకువచ్చింది. యాక్సిస్‌బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకర్ల కూటమి జిఎంఆర్‌కు లెటర్‌ఆఫ్‌ ఇంటెంట్‌ను ఇచ్చింది. 20-19 జూన్‌ 24వ తేదీ లోపు ఆదాని పవర్స్‌ పరిష్కారప్రణాళికను ముగించాలనినిర్ణయించింది. మొత్తం ఈక్విటీ వాటాను కొనుగోలుచేసి రుణపునర్‌వ్యవస్థీకరణచేయాలని నిర్ణయించినట్లు ఆదానిపవర్‌ స్టాక్‌ఎక్ఛేంజిలకు నివేదిక ఇచ్చింది. ఆదానిపవర్‌ 100శాతం వాటాను జిసిఇఎల్‌లో ఉంటుంది. 52.38శాతం వాటాను బ్యాంకర్లనుంచి కొనుగోలుచేస్తే మిగిలిన వాటాను 47.62శాతం జిఎంఆర్‌గ్రూప్‌నుంచి కొనుగోలుచేస్తుంది.

1.370 మెగావాట్‌ సంక్లిష్ట తర్మల్‌ పవర్‌ప్లాంట్‌ను రా§్‌ుపూర్‌జిల్లాలోని రా§్‌ుఖేడాలో నిర్మిస్తోంది. ఈ ప్లాంట్‌ రెండుయూనిట్లతో ఉంది. 685 మెగావాట్లు సమానంగా ఉంటుంది. 2015, 2016 జూన్‌లో ఈ యూనిట్లు ప్రారంభం అయ్యాయి. కోర్బా వెస్ట్‌పవర్‌ కంపెనీ ఆదానిపవర్‌ హోదాను పునరేకీకరణచేస్తుంది. థర్మల్‌ విద్యుత్‌లో ఇపుడు ఆదానికి 12,410 మోగావాట్ల సామర్ధ్యం ఉంటుంది. గ్రీన్‌ఫీల్డ్‌ప్రాజెక్టులపరంగా కూడాఆదాని దూసుకుపోతున్నది. అంతేకాకుండా ఆదాని కంపెనీ ఇటీవలే కొనుగోళ్లకోసమే అన్నట్లు విస్తరణప్రాతిపదికన ముందుకవెళ్లేందుకు మూలధన వ్యయం కోసం ఈనిధులను సమీకరించేందుకు నిర్ణయించింది. 750 మిలియన్‌ డాలర్లను సమీకరించి పెరుగుతున్న రుణాన్ని తగ్గించుకోవడంతోపాటు మరికొంత విస్తరణకు వినియోగిస్తుంది.

ఇందుకోసం ఆఫ్‌షోర్‌ బాండ్లను జారీచేస్తోంది. అమెరికాపదేళ్ల బెంచ్‌మార్క్‌ రాబడుల ఆధారంగా 265 బేసిస్‌ పాయింట్ల రాబడులుంటాయని చెపుతోంది. ఇందుకోసంబ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెర్రిల్‌ లించ్‌, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌బ్యాంకు సిటీ, జెపిమోర్గాన్‌, బార్‌క్లేస్‌ వంటి బ్యాంకర్లను లీడ్‌మేనేజర్లుగా పేర్కొంది. ఆదాని కంపెనీ రుణభారం 2018-19 నాటికి 14శాతంపెరిగి 19,590 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాదిలో 17,.169 కోట్లుగా ఉంటే ఇపుడు కొంతపెరిగింద.ఇ నికరలాభాలు కూడా 8శాతంపెరిగి 3990 కోట్లుగా ఉన్నాయి. ఏడాదిక్రితం ఉన్న 3674కోట్లనుంచి ఎనిమిదిశాతం పెరిగాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/