పతంజలి గ్రూపుకు యూఎన్‌ఎస్‌డీజీ అవార్డు

acharya Balkrishna receives 'UNSDG Award'
acharya Balkrishna receives ‘UNSDG Award’

హైదరాబాద్‌: ఆరోగ్య రక్షణలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులైన 10 మందికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి లక్ష్యాల విభాగం యూఎన్‌ఎస్‌డీజీ ఏటాఅవార్డుల ప్రదానం చేస్తోంది. అయితే ఈ సందర్భంగా ఈ అవార్డు ఈ సారి పతంజలి గ్రూపును యూఎన్‌ఎస్‌డీజీ హెల్త్‌కేర్‌ పురస్కారం వరించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగింది. పతంజలి గ్రూపు సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ శనివారం ఈ అవార్డును అందుకున్నారు. యోగాతోపాటు ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి సహకరించిన ప్రతిఒక్కరికి పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు ఆచార్య బాలకృష్ణ ట్విటర్‌లో పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/