ఆధార్‌ ఉంటే ఆన్‌లైన్‌లో ఉచితంగా పాన్‌ నెంబర్‌

aadhaar pan
aadhaar pan

న్యూఢిల్లీ: కేంద్ర ఆదాయపన్న శాఖ ప్రజలకు శుభవార్త తెలిపింది. ఇక నుంచి ఆధార్‌ కార్డు ఉండి పాన్‌ కార్డు కోసం దరఖాస్తులో ఉచితంగా పాన్‌ నంబరును వెంటనే అందించాలని ఆదాయపు పన్నుశాఖ నిర్ణయించింది. పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వారి ఆధార్‌ డేటాతో ఒన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌తో తక్షణమే ఎలాంటి జాప్యం లేకుండా ఈ పాన్‌ను జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆధార్‌ కార్డులో ఉన్న చిరునామా, తండ్రి పేరు, పుట్టిన తేదిల ఆధారంగా ఈ పాన్‌ కార్డులను వెంటనే జారీ చేయమన్నారు. డిజిటల్‌ సంతకంతో కూడిన పాన్‌ కార్డును క్యూఆర్‌ కోడ్‌తో అందించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. దీంతోపాటు పాన్‌ కార్డు ఫోర్జరీ చేయకుండా డిజిటల్‌ పోటోషాపింగ్‌తో తక్షణమే జారీ చేయాలని నిర్ణయించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/