80% బ్యాంకింగేతర సంస్థల్లోనే పొదుపు!

NON BANKING
NON BANKING

న్యూఢిల్లీ: భారత్‌లో జన్‌ధన్‌ ఖాతాలపేరిట ప్రతి ఒక్కరికి బ్యాంకుఖాతా ఉండాలన్న లక్ష్యంతో బ్యాంకింగ్‌సేవలు మరింతచేరువ చేసినప్పటికీ 80శాతం మంది భారతీయులు ఇప్పటికీ బ్యాంకుల్లో కాకుండా ఇతర వ్యవస్థల్లోనే పొదుపుచేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 157 కోట్ల బ్యాంకుఖాతాలున్నాయి. ఆర్ధికవ్యవస్థలో బ్యాంకుఖాతాలు గణనీయంగానే పెరిగినా సంఘటిత, అసంఘటితరంగం పొదుపు, రుణాలుసైతం తగ్గాయి. అధార్‌కార్డుసాయంతో బ్యాంకుఖాతానుప్రారంబించి ఆర్ధికచేకూర్పును మరింతపెంచినప్పటికీ బ్యాంకింగేతర వ్యవస్థల్లో పొదుపుచేసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. 2017 నాటికగణాంకాలనుచూస్తే జనాభాలో 80శాతం మందికి బ్యాంకుఖాతాలున్నాయి. 2014లో ఉన్న 53శాతంనుంచి భారీగా వృద్ధినమోదయింది. వీరిలో 83శాతం మంది పురుషులు, 77శాతం మంది మహిళలు ఉన్నారు. ఖాతాలపెరుగుదల మంచిదే ఇతర అసంఘటితరంగాలపై ఆధారపడటం తగ్గించినట్లవుతుంది.ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదికనుచూస్తే ఈ ఏడాది మొత్తం డిజిటల్‌చెల్లింపులపైనే భారత్‌ ఫోకస్‌ పెట్టింది. 36శాతానికిపైగా పౌరులు డిజిటల్‌ లావాదేవీలునిర్వహించారు. దీనివల్ల నగదు ఆదాసైతం జరిగిందని ప్రపంచ బ్యాంకు చెపుతోంది. ఇక పెన్షన్‌ చెల్లింపుల్లో నిధుల లీకేజిసైతం 47శాతం తగ్గింది బయోమెట్రిక్‌ స్మార్ట్‌కార్డ్స్‌ద్వారాను ఎక్కువ జరిగాయి. ఇక మొబైల్‌ఫోన్లు రాక పెరిగినప్పటినుంచి ఇక మొబైల్‌బ్యాంకింగ్‌వైపు దృష్టిపెరిగింది. ప్రపంచంలో మూడింట రెండొంతులమందికి బ్యాంకింగ్‌ వసతి లేకపోయినా వారంతా మొబైల్‌ఫోన్‌ వినియోగిస్తున్నారు. అంతకుముందు భారత్‌లోసైతం 50శాతం వరకూ ఉంది. జనాభాలో కేవలం ఏడుశాతం మంది మాత్రమే ఆర్ధికసంస్థలనుంచి రుణాలుతీసుకుంటుంటే ప్రతి ఐదుగురిలో ఒకరు ఆర్ధికసంస్థల్లో పొదుపుకుప్రాధాన్యతనిస్తున్నారు. గడచిన ఆరేళ్లలో ఈ పొదుపు,రుణపరపతి వ్యవస్థలు రెండుశాతం తగ్గింది. ఇక డెబిట్‌కార్డులు మారుమూల గ్రామీణప్రాంతాలకుసైతం వెళుతున్నాయి. క్రెడిట్‌కార్డులు మాత్రం కేవలం మూడుశాతం జనాభా మాత్రమే వినియోగిస్తున్నారు. భారత్‌,కెన్యాలను పరిగణనలోనికి తీసుకుంటే సగంకంటే తక్కువమంది ఖాతాదారులకుమాత్రమే డెబిట్‌కార్డులున్నాయి. ఎక్కువమంది నేరుగా కొనుగోళ్లుచేస్తున్నారు. డిజిటల్‌చెల్లింపులు మరింతగా పెరిగాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు అంచనావేసింది. యుపిఐ వ్యవస్థ, ఆధార్‌ ఆధారిత నేరుగా లబ్దిబదిలీ వంటివి కొంత బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఊతం ఇస్తున్నాయి. అయినా ఇప్పటికీ కేవలం రెండుశాతం మందికి మాత్రమే మొబైల్‌ వ్యాలెట్లు ఉండగా, మూడుశాతం మంది ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లిస్తున్నారు. గత ఏడాదిలో 16.7శాతంమందిమాత్రమే డిజిటల్‌చెల్లింపులవ్యవస్థద్వారా చెల్లింపులు స్వీకరించారు. ఇక మొబైల్‌ మనీఖాతాలనుచూస్తే రెండుశాతం, ఆన్‌లైన్‌ బిల్లులుచెల్లించేవారిసంఖ్య మూడుశాతం, ఆన్‌లైన్‌షాపింగ్‌ 4శాతం, డిజిజిటల్‌చెల్లింపులస్వీకరణ 16శాతం, డిజిటల్‌ చెల్లింపులు చేసినవారిసంఖ్య 20శాతం మాత్రమే ఉంది. ఈ సంఖ్య మరింతగాపెరగాల్సి ఉందని డిజిటల్‌ అక్షరాస్యతలో ఇదొక కార్యాచరణగాప్రపంచ బ్యాంకు విశ్లేషిస్తోంది.ఇక కార్డుల వినియోగంలో భారత్‌లో డెబిట్‌కార్డులు 2011లో ఎనిమిదిశాతం ఉంటే క్రెడిట్‌కార్డులు రెండుశాతం మాత్రమే ఉన్నాయి. 2014లో డెబిట్‌కార్డులు 22శాతానికి, క్రెడిట్‌కార్డులు నాలుగుశాతానికిపెరిగితే 2017 నాటికి క్రెడిట్‌కార్డులు 3శాతానికి తగ్గాయి. డెబిట్‌కార్డులుమాత్రం 33శాతానికిపెరిగాయి.