7.38 శాతం పెరిగిన నిరుద్యోగం!

employment
employment

న్యూఢిల్లీ: భారత్‌లో నిరుద్యోగం 27 నెలల గరిష్టానికి చేరింది. డిసెంబరునెలలో 7.38శాతంపెరిగిందని అంచనా. గత ఏడాదిమొత్తంగాచూస్తే కోటిమందికిపైగా ఉపాధినష్టం జరిగిందని అంచనా. మొత్తం అంతకుముందు ఏడాది డిసెంబరు చివరినాటికి 40.678 మందికి ఉపాధికల్పిస్తే 2018 డిసెంబరు నెలలో కేవలం 39.49 కోట్లమందికి ఉపాధి లభించిందని భారత ఆర్ధికవ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సిఎంఐఇ) వెల్లడించింది. గత ఏడాదిడిసెంబరులో నిరుద్యోగం 6.62శాతంనుంచి 7.38శాతానికిపెరిగింది. అదే డిసెంబరులో 2018 సంవత్సరంలో 4.78శాతంగా ఉంది. ఒకదశలో 8.46శాతానికిసైతం ఎగబాకింది. మొత్తం 1.09 కోట్లఉద్యోగాలు గడచిన 12నెలల కాలంలో నియమించాల్సి ఉంటే 83శాతం అంటే 91.4 లక్షలమందికి ఉపాధి నష్టంజరిగిందని, వారికి ఉపాధి లేకుండాపోయిందని తేలింది. మొత్తం 1,58 లక్షల కుటుంబాలను ప్రామాణికంగా తీసుకుని ఉపాధి గణాంకాలు లెక్కిస్తారు. 2017 డిసెంబరులో మొత్తం 26.94 కోట్లు మందికి ఉద్యోగాలు గ్రామీణప్రాంతాల్లో లభించాయి. అయితే డిసెంబరు 2017తో పోలిస్తే కొంతమేర తగ్గిందనే చెప్పాలి. 26.94 కోట్లనుంచి 26.03 కోట్లకు తగ్గారు. మిగిలినవారు 18 లక్షల మంది అర్బన్‌ప్రాంతాల్లోనిరుద్యోగులుగా మిగిలిపుతున్నారు. మొత్తంగాచూస్తే 13.84 కోట్లనుంచి 13.66 కోట్లకు చేరింది. సిఎంఐఇ డేటానుచూస్తే కార్మిక ఉపాధి అంచనాలు, ఉద్యోగ వయసు ప్రజల్లోను, ఉపాధిపై పనిచేసేందుకు ఇష్టం ఉన్న జనాభా కూడా కొంతమేర నిరుద్యోగంరేట్‌కంటే పడిపోతున్నది. ఇక కార్మికభాగస్వామ్య రేట్‌ సైతంక్షీణిస్తోంది. 43.57శాతంగా డిసెంబరునెలలో ఉంది. అలాగే 2018 డిసెంబరులో ఈరేట్‌ 42.47కి దిగివచ్చింది. 2016 డిసెంబరులో ఈ కార్మికభాగస్వామ్యశాతం 45.15శాతంగా ఉంది. సెప్టెంబరులో 47.84గా కొనసాగింది. గ్రామీణప్రాంతాల్లోనే ఎక్కువగా ఉపాధి నష్టంజరుగుతున్నట్లు అంచనా. పట్టణప్రాంతాల్లోకూడా గత ఏడాది కొంత ఉపాధినష్టం క్రమేపీ పెరుగుతూ వస్తోందని సిఎంఐఇ వెల్లడించింది