62.5 బిలియన్‌ డాలర్ల కార్పొరేట్‌ విలీనాలు

DOLLARS1
DOLLARS

62.5 బిలియన్‌ డాలర్ల కార్పొరేట్‌ విలీనాలు

ముంబై, జనవరి 26: భారత్‌ కార్పొరేట్‌రంగంలోని విలీనాలు కొనుగోళ్లు గత ఏడాది మొత్తంగాచూస్తే 1500కుపైగా జరిగాయి. వీటన్నింటి విలువలు కూడా 62.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. మరిన్ని ఆర్థికసంస్కరణలు అమలయితే ఈ ఏడాది కూడా కార్పొరేట్‌రంగంలో మరిన్ని కొనుగోళ్లు, కంపె నీల విలీనాలు ఉంటాయని అంచనా. గ్రాంట్‌ థార్న్‌టన్‌ సంస్థ సర్వేను చూస్తే గత ఏడాది విలీనాలు, కొనుగోళ్ల విలువలు గరిష్టంగా నమోదయ్యాయి. గడచిన ఐదేళ్లలో ఈ లావాదేవీలు 48.5 బిలియన్‌ డాలర్లుగా ఉనానయి. కేవలం 516 డీల్స్‌ మాత్రమే జరిగితే 2016లో 1500 డీల్స్‌ వరకూ జరగడం విశేషం. ఇక ప్రైవేటు ఈక్విటీ కార్యకలాపాలు మాత్రం 2016లో తగ్గాయి. గడచిన నాలుగేళ్లుగా ఇదేపరిస్థితి కొనసాగుతోంది. ఏడాది మొత్తంగాచూస్తే 13.9 బిలియన్‌ డాలర్ల విలువైన 971 ఈక్విటీ డీల్స్‌ జరిగాయి. ఎఫ్‌డిఐ సంస్కరణలు, ప్రాథమిక మార్కెట్లలో మరింత అవ కాశాలు పెరిగితే మెగా డీల్స్‌ సంఖ్యా పరంగా మరింతగావస్తాయని గ్రాంట్‌ థార్న్‌టన్‌ ఇండియా భాగస్వామి హరీఫ్‌ హెచ్‌వివెల్లడించారు. జిఎస్‌టి వంటి పరోక్షపన్నులరంగ సంస్కర ణలు అమలులోనికి రావాల్సిఉంది. అలాగే వన్‌రాంక్‌వన్‌పెన్షన్‌, ఏడో వేతనసంఘం సిఫారసులు వంటివి కొంత వృద్ధికి ఆస్కారం ఇస్తాయని హరిష్‌ అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి మరింత పెరిగింది. ఈపరిణామాలు భారత్‌కు మంచి అవకా శంగా పరిణమించాయి. అయితే బ్యాంకింగ్‌రంగపరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ప్రైవేటు ఇన్వెస్ట్‌ మెంట్లు, ముడిచమురుధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి వంటివి కీలకంగా భారత్‌పై ప్రభావంచూపుతాయి. దేశీయ వినియోగంపరంగా పటిష్టమైన ఐపిఒ మార్కెట్‌, మౌలిక వనరుల రంగంలో వ్యయం, బ్యాంకుల పునర్‌వ్యవస్థీకరణ, ప్రభుత్వ ప్రోత్సాహకర విధివిధానాలు దేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిని మరింత ప్రగతివైపు నడిపిస్తాయని గ్రాంట్‌థార్న్‌టన్‌ అంచనా వేసింది.