60వేల మంది రిటర్నులపై రెండోదశ పరిశీలన

Tax
Tax

60వేల మంది రిటర్నులపై రెండోదశ పరిశీలన

న్యూఢిల్లీ ఆదాయపు పన్నుశాఖ కొత్తగా 60వేల మంది రిటర్నులు దాఖలు చేసినవారిని రెండోదశగా విచారణ ప్రారం భించింది. ఆపరేషన్‌ క్లీన్‌ మనీ కింద నల్లధనం కట్టడికార్యా చరణ రెండోదశను అమలుచేస్తున్నట్లు ప్రకించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు మొత్తం 9334 కోట్ల రూపాయలు లెక్కలుతేలని ధనం గుర్తించామని,గత ఏడాది నవంబరు తొమ్మిదవ తేదీనుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీవరకూ పెద్దనోట్ల రద్దు కాలంలోనే నల్లధనం బైటపడిందని ప్రకటిం చింది. 60వేల మందికిపైగా వ్యక్తులు, వీరిలో 1300 మంది ఎక్కువ రిస్క్‌ ఉన్న వ్యక్తులపై కూడా విచారణ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

అలాగే 6600 కేసుల్లో అత్యంత ఎక్కువ విలువలున్న స్థిరాస్తి కొనుగోళ్లుపరంగా ఆరువేల లావాదేవీలు జరిగినట్లు అంచనావేసింది. వీటన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు జరుపుతున్నటు ్లప్రకటించింది. వీరందరికి తొలివిడత జారీచేసిన సంజాయిషీ నోటీసులపై ఎలాంటి స్పందన రాలేదని అందువల్లనే వీరిపై సమగ్ర విచారణ చేయాల్సి వస్తున్నట్లు వెల్లడించింది. అనుమానిత నగదు డిపాజిట్లపై కూడా క్లీన్‌ ఆపరేషన్‌లోభాగంగా దర్యాప్తు చేస్తామని ఐటి అధికారులు స్పష్టంచేసారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీ ఆపరేషన్‌ క్లీన్‌ మనీ కార్యాచరణను ఐటిశాఖ ప్రారంభిం చింది. శాఖాపరంగా ఆన్‌లైన్‌లోనే ఐటిసందేహాలపై లేఖలు రాసింది. మొత్తం 17.92 లక్షల మందికి ఈ తాఖీదులు అందితే వీరిలో కేవలం 9.46 లక్షలమంది స్పందించినట్లు ఐటిశాఖ వెల్లడించింది.