5000 మందికి ఉద్వాసన

TATA
TATA

5000 మందికి ఉద్వాసన

ముంబై, అక్టోబరు 10: టాటాగ్రూప్‌ తన 21 ఏళ్ల ఫోన్‌ సర్వీసు వెంచర్‌ టాటా టెలిసర్వీసస్‌కు త్వర లోనే గుడ్‌బై చెప్పబోతుంది. ఈ వైర్‌లెస్‌ సర్వీసు లను మూసివేస్తున్న క్రమంఓ టాటా సర్వీసెస్‌కు చెందిన ఉద్యోగులను టాటా గ్రూప్‌ ఇంటికి పంపేస్తోంది. ఈ మూసి వేత ప్రక్రియలో భాగంగా దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులకు మూడు నుండి ఆరు నెలల నోటీసు కూడా ఇస్తోంది. ఎవరైతే ముందస్తుగా కంపెనీని వీడి వెళ్లాలనుకుంటారో వారికి సెవరెన్స్‌ ప్యాకేజెస్‌ను కూడా కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.

పెద్ద వారికి వాలంటరీ రిటైర్‌ మెంట్‌ స్కీమ్‌ (వీఆర్‌ఎస్‌)ను, కొంత మంది ఉద్యోగులను మాత్రమే ఇతర గ్రూప్‌ కంపెనీలకు టాటాగ్రూప్‌ బదిలీ చేస్తోంది.నష్టాల్లో కూరుకుపోయిన తమ టెలికాం కంపెనీలని త్వరలోనే మూసి వేయబోతున్నామని కంపెనీ ఎగ్జిక్యూ టివ్‌లు, ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్‌ చెప్పారు. టాటాగ్రూప్‌ ఎల్లవేళలా తమ ఉద్యోగు లను కాపాడుతుందని, కానీ ఈ సారి కొద్ది మందిని మాత్రమే ఇతర గ్రూప్‌ కంపెనీల్లోకి పంపుతున్నామని ఓ సీనియర్‌ అదికారి చెప్పారు.

టాటా టెలిసర్వీసు కంపెనీ ఉద్యోగులతో ఇతర టాటా కంపెనీలపై భారం మోపడం అన్యాయ మంటూ ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాలకు తగ్గ వారిని మాత్రమే బదిలీ చేస్తున్నామని తెలిపారు. సీనియర్‌ ఉద్యోగులకు వచ్చే నెలల్లో వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ను ఆఫర్‌ చేస్తున్నామని టాటా గ్రూప్‌ సీనియర్‌ అధికారి చెప్పారు. మెజార్టీ ఉద్యోగులకు టాటా గ్రూప్‌కు చెందిన ఈ టెలికాం యూనిట్‌ మూడు నుండి ఆరు నెలల నోటీసును ఇది ఆఫర్‌ చేసింది. ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో వారు సెవరెన్స్‌ ప్యాకేజీని అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. 2017 మార్చి వరకు టాటా టెలిసర్వీసులో 5,101 మంది ఉద్యోగులున్నారు.