50 వేల వేతనంతో ఉద్యోగ నిమామకాలు

BSNL
BSNL

50 వేల వేతనంతో ఉద్యోగ నిమామకాలు
జెఎఒ పోస్టుల భర్తీకి కసరత్తు

న్యూఢిల్లీ: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ జెఎఒ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.దీని ద్వారా దేశ వ్యాపంగా ఉన్న వివిధ బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లోని జెఎఒ పోస్టులను భర్తీ చేస్తారు.ఎంపికైన వారికి నెలకు 50 వేల రూపాయలు వేతనం చెల్లిస్తారు.యుపి,మహారాష్ట్ర తరువాత ఎపిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక సర్కిళ్ల ఆధా రంగా జరుగుతుంది. జెఎఒ:996 ఆంధ్రప్రదేశ్‌, తెలంగా ణాలకు కేటాయించిన పోస్టులు,72,19. విద్యార్హతలు కామర్స్‌లో మాస్టర్స్‌్‌ డిగ్రి, చార్టెడ్‌ అకౌంటెంట్‌, ఐసిడబ్యూఎ, కంపెనీ సెక్రటరీ,సిఎస్‌ పూర్తి చేసి ఉండాలి.వయసు: 2017 జనవరి 1 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.నిబంధనల ప్రకారం ఎస్‌సి,ఎస్‌టి, ఒబిసి, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: బిఎస్‌ఎన్‌ఎల్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.ఫీజు జనరల్‌, ఒబిసి అధ్యర్థులకు 1000 రూపాయలు,ఎస్‌సి,ఎస్‌టిలకు 500 రూపాయలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.రాత పరీక్షను ఆల్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో జనరల్‌ ఇంగ్లీష్‌,జనరల్‌ అవేర్‌నెస్‌,ఆప్టిట్యూడ్‌ 150 మార్కెట్‌లు. ఫపర్‌-2లో ఫైనాన్సిక్‌ అండ్‌ కమర్షియల్‌ అకౌంట్స్‌ 300 మార్కులు.ఈ ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్‌ ప్రాతిపదికన ఇంటర్వ్యులకు పిలుస్తారు.ఇందులో ప్రతిభను పరిగణలోకి తీసుకుని అర్హుల జాబితాను ప్రకటిస్తారు.ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 11.ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది అక్టోబరు 15.రాత పరీక్ష తేది నవంబర్‌ 5.