50లక్షల మంది కస్టమర్లకు హోంక్రెడిట్‌ విస్తరణ

cash111
cash111

50లక్షల మంది కస్టమర్లకు హోంక్రెడిట్‌ విస్తరణ

భారత్‌లో వచ్చేనెల నుంచి ఆన్‌లైన్‌ రుణాలు

ముంబై,: హోంక్రెడిట్‌ఫైనాన్స్‌ 2018 చివరినాటికి 50లక్షల మంది కస్టమర్లకు చేరువ కావాలన్న లక్ష్యంతో నెట్‌వర్క్‌ను పటిష్టంచేస్తున్నది. ఆర్ధికచేకూర్పు, మొదటిసారి రుణం తీసుకునేవారికి క్రెడిట్‌ స్కోర్‌ను పెంపొందించుకునేందుకు వారిలో అవగాహన పెంచడం వంటివిచేస్తోంది. అంతేకాకుం డా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆన్‌లైన్‌లోనే రుణాలు పంపిణీచేసేందుకు నిర్ణయించింది. కస్టమర్లరుణా లను మరింతగా పెంచుకునేందుకు ఎక్కువ కృష ిచేస్తున్నది. గుర్‌గావ్‌కేంద్రంగా పనిచేస్తున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ భారత్‌లో ఐదేళ్లలో మరింతపటిష్టం అయింది. దేశవ్యాప్తంగా రుణపరి మితిని సగటున రూ.10వేలకు జారీచేస్తోంది. జులై సెప్టెంబరు మాసంలో గత ఏడాది 87.2 శాతం మార్కెట్‌ వాటా సాధించినట్లు ప్రకటించింది. దేశం లో రెండు మిలియన్ల కస్టమర్లు ఉన్నారని ఇకపై ఆన్‌లైన్‌ రుణాలద్వారా మరింతగా చేరువ అవుతా మని వెల్లడించారు. కంపెనీ సిఇఒ పావెల్‌ మాకో మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో హోంక్రెడిట్‌ భారత్‌ లో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. ప్రస్తు తం ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో తాము అంది స్తున్న సేవలు విజయవంతం అయ్యాయని, భారీ విస్తరణతోపాటు మంచి వృద్ధిని కూడా సాధించినట్లు సిఇఒ వెల్లడించారు. 2012-13లో ఐదు నగరాల్లో ప్రారంభించిన నాన్‌బ్యాంకింగ్‌ఫైనాన్స్‌ నేడు 15 భారతీయ రాష్ట్రాల్లోని 60నగరాలకు చేరువ అయిం దని కేవలం ఐదేళ్లలోనే ఈ విజయం సొంతంచేసు కున్నట్లు సిఇ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హోమ్‌క్రెడిట్‌ఫైనాన్స్‌ భారత్‌లో ఏడువేల టచ్‌పాయింట్‌లతో పనిచేస్తోంది. 17వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తు న్నట్లు వెల్లడించింది. హోంక్రెడిట్‌ బివికి అనుబం ధంగా ఉన్న హోంక్రెడిట్‌ ఇండియా భారత్‌లో పటిష్టం కావడమే కాకుండా అంత ర్జాతీయంగా మాతృసంస్థకు లక్షమందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నట్లు వివరించింది. 11 దేశాల్లో 64 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నా రని 2.40 లక్షల టచ్‌పాయింట్లు రుణ కార్యాల యాలు, శాఖలు, పోస్టాఫీసులు సౌజన్యంతో కూడా నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.