5 పేమెంట్‌ బ్యాంకుల మూసివేత

Payment Banks
Payment Banks

ముంబయి: రిజర్వుబ్యాంకు అనుమతులు మంజూరుచేసిన 11 పేమెంట్‌ బ్యాంకుల్లో ఐదు బ్యాంకులు ఇప్పటికే బోర్డు తిప్పేశాయి. పేమెంట్‌బ్యాంకులకు తొలినాళ్ల లో వచ్చినంత ప్రాచుర్యం రానురాను అడుగంటిపోయింది. డిపాజిట్లు మందగించడం, రుణపరపతి కల్పించే అవకాశం లేకపోవడమే ఈ బ్యాంకుల మనుగడకు ముప్పు వాటిల్లి నట్లు చెపతున్నారు. ఆర్‌బిఐ నాలుగేళ్లక్రితం 11 పేమెంట్‌ బ్యాంకులకు లైసెన్సులు మంజూరుచేసింది. ఆర్థికచేకూర్పు ను మారుమూల గ్రామాలకుసైతం విస్తరించడం, తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్‌చెల్లింపుల వ్యవస్థ ను అమలుకు తీసుకురావడంద్వారా మరింతగా ఆర్థిక లావాదేవీలను పెంచడం అనేది ముఖ్యోద్దేశ్యం. వాస్తవానికి 11 మంది బ్యాంకర్లలో ఇపుడు కేవలం ఆరు మాత్రమే పనిచేస్తున్నాయి.

మరికొన్ని కొన్ని నెలలకే మానుకున్నాయి. ఎయిర్‌ టెల్‌ పేమెంట్స్‌బ్యాంకు, ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌బ్యాంకు, ఫినో పేమెంట్స్‌బ్యాంకు, ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌బ్యాంకు, జియో పేమెంట్స్‌బ్యాంకు, ఎన్‌ఎస్‌డిఎల్‌ పేమెంట్స్‌బ్యాంకు, పేటిఎం పేమెంట్స్‌ బ్యాంకులు ఏడు మాత్రమే ఇప్పటివరకూ కొనసాగుతున్నా యి. ఆదిత్యబిర్లా పేమెంట్స్‌బ్యాంకు తాజాగా తన కార్య కలాపాలను నిలిపివేస్తున్నట్లు జులైలోనే వెల్లడించింది. దీనితో మొత్తం సంఖ్య ఆరుకు తగ్గిపోయింది. వీటిలో మూడు కంపెనీలు క్రియాశీలకంగా కొనసాగుతున్నాయి. మొబైల్‌ నెఫ్ట్‌ లావాదేవీలపరంగా ఆర్‌బిఐ వెల్లడించిన గణాంకాలకు అనుగు ణంగా ఈ మూడుసంస్థ లున్నాయి. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు, ఫినోపేమెంట్స్‌ బ్యాంకు, పేటిఎం పేమెంట్స్‌బ్యాంకులు చురుకుగా ఉన్నా యి. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌బ్యాంకు కూడా ఇపుడు చిన్నస్థాయి బ్యాంకుగా మారేందుకు కృషిచేస్తోంది.

పరిమితవనరులే ఆదాయం కావడం, బిజినెస్‌మోడల్‌ సవాళ్ల కు దారితీస్తుండటంతో మార్జిన్లు కూడా తగ్గిపోతున్నాయి. దీనితో పేమెంట్స్‌ బ్యాంకులు గిట్టుబాటైన రీతిలో కొనసాగ లేకపోతున్నాయి. 2017-18 భారత్‌లో బ్యాంకింగ్‌ ధోరణు లు చూస్తే 2017లో 242 కోట్లు నష్టాలు 516 కోట్లకు 2018 చివరి నాటికి పెరిగిపోయాయి. ఎక్కువగా నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండటం, రాబడులు నీరసించడమే నష్టా లకు కారణమవుతున్నాయి. ఇక ఖాతాల్లో డిపాజిట్లు తొమ్మి ది శాతంగా మాత్రమే ఉన్నాయి. 2018-19లో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు 338 కోట్ల నష్టం చవిచూసింది. అంతకు ముందు ఏడాది 272 కోట్ల కంటే పెరిగింది. ఆదాయవనరులపరంగా చూస్తే 254 కోట్లు ఆర్జించింది. అయితే ఖర్చులు కూడా 593 కోట్లకు పెరిగా యి. డిపాజిట్లు 270కోట్లకు పడిపోయాయి. అంతకుముం దు ఏడాది 290 కోట్లుగా ఉన్నవల్లా తగ్గాయి. 2018-19 సంవత్సరంలో మాత్రం 19 కోట్ల రూపాయలమేర లాభాలు చవిచూసింది.

భారత్‌లో మొట్టమొదటి పేమెంట్‌ బ్యాంకు లాభాలు గడించిందని తెలుస్తోంది. ఇక ఈ బ్యాంకులకు సంబంధించి ఆర్‌బిఐ మార్గదర్శకాలు కూడా కొన్ని సవాల్‌ చేస్తున్నాయి. బ్యాంకులు కేవలం లక్ష రూపాయల వరకూ మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. 75శాతం డిపాజిట్లను ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాలి. కనీసం ఏడాదిపాటు కొనసాగించాలి. మిగిలిన 25శాతం వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్‌చేయాలి. ఇటీవల 3-4ఏళ్లుగా ఏడాది కాలం ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులు 7-8శాతానికి పెరిగాయి. గడచిన కొన్ని నెలలుగా చూస్తే ఏడాదికాలం ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే జిసెక్స్‌ గణనీయంగా రాబ డులు పడిపోయాయి. ప్రస్తుతం 5.6శాతంగా ఉన్నాయి.

దీనివల్లనే పేమెంట్స్‌ బ్యాంకుల రాబడులు, లాభదాయకత కూడా సన్నగిల్లింది. ఇతర వాణిజ్యబ్యాంకుల తరహాలో పోటీని తట్టుకోవాలంటే పేమెంట్స్‌బ్యాంకులు ఆకర్షణీయ మైన వడ్డీరేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ బ్యాంకులు తక్కువ విలువలున్న డిపాజిట్లుపై 3.5శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. 25-50 లక్షల వరకూ ఉన్న డిపాజిట్లకు ఇదే రేటు వర్తిస్తోంది ప్రైవేటు బ్యాంకులు ఎస్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులు 4-5శాతం వడ్డీ ఇస్తోంది. లక్ష నుంచి ఆపైబడిన డిపాజిట్లకు వర్తింప చేస్తోంది. ఎక్కువ మొత్తం డిపాజిట్లు కోటి రూపాయల వరకూ ఉన్నవాటికి 5.5నుంచి ఆరుశాతంగా వడ్డీనిస్తోంది.

కొన్ని చిన్న ఫైనాన్స్‌బ్యాంకులు డిపాజిట్లపై 5-6శాతం వడ్డీనిసైతం ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు నాలుగు శాతానికి పైబడి వడ్డీలిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ 7.25శాతం వడ్డీని ఇస్తామని వెల్లడించింది. ప్రతి డిపాజిట్‌పైనా ఈ వడ్డీశాతంతో నష్టం ఎదురవుతోంది. పేటిఎం పేమెంట్స్‌ బ్యాంకుపరంగా నాలుగుశాతం వడ్డీని అందిస్తోంది. ఇక ఫినో పేమెంట్స్‌ సంస్థ కూడా 6.25శాతం లక్ష వరకూ అందిస్తున్నది. ఆపైబడిన డిపాజిట్లకు 7.25శాతంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే పేమెంట్స్‌ బ్యాంకులకు వడ్డీ తక్కువ కావడం ఒకటి. డిపాజిట్లు మందగమనంతో ఉండటంతో పాటు నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలబాటపట్టి మూసివేత దిశగా ఉన్నాయి.