ఆర్థిక, సేవల రంగంలో 48వేల కొత్త కొలువులు!

jobs
jobs

ముంబయి: ఆర్థికసేవలరంగంలో 2020 ఆర్థికసంవత్సరం మొదటి ఆరునెలల్లోనే 47,800 కొత్తకొలువులు వస్తాయని సర్వేలు చెపుతున్నాయి. గ్రామీణమార్కెట్లలో ఎక్కువ అవకాశాల ఉంటాయని, ఆర్థికసేవలపరంగా గ్రామీణుల్లో పెరుగుతున్న చైతన్యమే ఇందుకు కీలకమని ప్రత్యేకించి రెండు, మూడోశ్రేణి నగరాల్లో ఈ అవకాశాలు పెరుగుతాయని సర్వేలు ప్రస్తావిస్తున్నాయి. బ్యాంకులు, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో ఎక్కువ ఉంటాయని అంచనా. బ్యాంకింగ్‌ ఆర్థిక, బీమా సేవలరంగంలోనే ఎక్కువ అవకాశాలు ఒకమోస్తరు నగరాల్లో కూడా పెరుగుతాయని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ హెడ్‌ అమిత్‌వాదేరా వెల్లడించారు. రెండోశ్రేణి నగరాల్లో ఐదుశాతం వృద్ధి ఉంటుందని, ఏప్రిల్‌ సెప్టెంబరులో ఈ వృద్ధి నమోదయితే మూడోశ్రేణి పట్టణాల్లోను, గ్రామీణప్రాంతాల్లోను రెండుశాతం చొప్పున ఆర్థికసేవలరంగంలో ఉపాధి పెరుగుతుందని వాదేరా వెల్లడించారు.

కంపెనీ ఏప్రిల్‌ -సెప్టెంబరు ఆర్థిక నివేదికను ఆయన విడుదలచేసారు. 19 సెక్టార్లు, 14 భౌగోళిక ప్రాంతాల్లో మొత్తం 775 సంస్థలుభారత్‌లోను, 85 బిజినెస్‌ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగాను ఎంచుకుని సర్వేచేసింది. సర్వే ఆధారంగాచూస్తే ఢిల్లీలోనే ఎక్కువ ఉపాధి వస్తుంది. 5420 మందికి కొత్త ఉద్యోగాలుంటాయి. అనంతరం ముంబయిలో 5380 మందికి కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు తేలింది. బ్యాంకుల డిజిటైజేషన్‌ కారణంగా ఈ రంగంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా. సీనియర్‌ స్థాయి మినహాయించి మిగిలిన కేటగిరీల్లో నియామకాలు పెరుగుతున్నట్లు తేలింది. మధ్యస్థాయిలో నాలుగుశాతం పెరుగుతుందని, ప్రారంభ స్థాయి జూనియర్‌ కేటగిరీల్లో మూడుశాతం చొప్పున ఉంటుందని తేలింది. మధ్యస్థాయి బిజినెస్‌సంస్థలు కూడా ఐదుశాతం మేర పెరుగుతాయని అంచనా. ఉపాధి అవకాశాల్లో రెండుశాతం వృద్ధి ఉంటుంది.

ఇక ఇవికాకుండా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఇంజనీరింగ్‌ ఐదుశాతం, ఆఫీస్‌సేవలు నాలుగుశాతం, బ్లూకార్‌ కేటగిరీ ఆలుగుశాతం, మార్కెటింగ్‌ మూడుశాతం ఉంటాయి. ఇక ఈ రంగాలనుంచి తరచూ కొలువులు మారుతున్న శాతం ఎక్కువగానే ఉంది. మొత్తం 19 రంగాల్లో తరచూ ఉద్యోగులు కంపెనీలు వీడి వెళుతున్నారు. మరో ఐదు ఇతర రంగాలు మరింతగా ఎక్కువ నిష్క్రమణలు చవిచూస్తున్నాయి. రియల్‌ఎస్టేట్‌, ఐటి, కెపిఒ, టెలికమ్యూనికేషన్‌, పర్యాటక, ఆతిథ్యరంగాల్లో ఈ తరచూ ఉద్యోగుల నిష్క్రమణలు ఎక్కువ ఉన్నాయి. ఇక వ్యవసాయం, ఆగ్రోకెమికల్స్‌, విద్యాసేవలు, ఎఫ్‌ఎంసిజి, ఆర్థికసేవలు, రిటైల్‌రంగాల్లో కొంతమేర పెరుగుతున్నట్లు టీమ్‌లీజ్‌సర్వే ప్రస్తావించింది.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/