మూడురెట్లు పెరిగిన పేటిఎం నష్టాలు

Paytm
Paytm

బెంగళూరు: పేటిఎం నష్టాలు గతం కంటే మూడురెట్లు పెరిగాయి. ఈ ఏడాది లోనే 4217 కోట్లకు పెరిగాయని, ఖర్చులు పెరగ డమే ఇందుకు కారణమని అంచనా వేస్తున్నారు. పేటిఎం మాతృసంస్థ వన్‌97 తన మొట్టమొదటి లాభాలను 2021 సంవత్సరం నాటికి ఆర్జించే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. 207.61 కోట్లు వస్తుందని చెపుతున్నారు. కంపెనీ మొత్తం రాబడులు 8.2శాతం పెరిగి 3579.67 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో 3309.61 కోట్లుగా ఉన్న రాబడులు మాత్రం పెరిగాయి. కంపెనీ సమిష్టి నష్టం యూస్తే 4217.20 కోట్లుగా ఉందని వెల్లడించింది. అంతకుముందు ఏడాది 1604.34 కోట్లుగాఉంది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ వార్షిక నివేదికను వెల్లడించింది. సంస్థ మొట్టమొదటిసారి లాభా లను 207.61 కోట్లమేర మొదటిసారి 2021లో లాభాలకు రాగలదని అంచనా వేస్తున్నారు. వన్‌97 కమ్యూనికేషన్స్‌ నికర లాభాలు 2026 నాటికి ఇంచుమించుగా 8512.69 కోట్లుగా ఉంటుందని అంచనా. కంపెనీ మొత్తం రాబడులు 8.2శాతంపెరిగి 3579.67 కోట్లుగా ఉంటాయని అంచనా. అంతకుముందు ఏడాది 3309.61 కోట్లకంటే గణనీయంగా పెరిగింది. కంపెనీ ఖర్చు లు కూడా గణనీయంగాపెరగాయి. 4864.53 కోట్లనుంచి 7730.14కోట్లకు పెరిగింది. గతనెల లోనే కంపెనీ వ్యవస్థాపకుడు విజ§్‌ుశేఖర్‌శర్మ మాట్లాడుతూ పేటిఎం విలువలు 25శాతం పెరిగి 15 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు వెల్లడించారు. అనేక మంది ఉద్యోగులు తమతమ వాటాలను 150 మిలియన్‌ డాలర్ల వరకూ తమతమ వాటాలను నగదీకరించుకోగలిగారని వెల్లడించారు.