39నెలల గరిష్టస్థాయికి టోకుధరల సూచి ద్రవ్యోల్బణం

INFLATION 15

39నెలల గరిష్టస్థాయికి టోకుధరల సూచి ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ,: టోకుధరల సూచి ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 6.55శాతానికి పెరిగినట్లు అంచ నా. ఏడాదిక్రితం 0.85శాతం తగ్గిన ద్రవ్యోల్బణం తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరినెలలో పెరిగింది. ఇంధ నం, ఆహార ఉత్పత్తులధరల వల్లనే ద్రవ్యోల్బణం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వార్షికపద్ధతి లో చూస్తేరాయిటర్స్‌ వార్తాసంస్థ వేసిన అంచనాలప్రకారం చూస్తే 5.90శాతంగా ఉంటుందని అం చనా వేసారు. జనవరి నెలలో ధరలు 5.25శాతంగా పెరిగా యి. గడచిన రెండున్నరేళ్లలో వేగంగా వృద్ధిచెందినట్లుగా నిపు ణులు అంచనా వేస్తున్నారు. గతనెలలో టోకుధరల ఆహార ఉత్పత్తులధరలు 2.69శాతంగా ఉన్నాయి. జనవరిలో 0.56 శాతం నుంచి ఈ ధరలు పెరి గాయి. మొత్తంమీద టోకుధరల సూచి ద్రవ్యోల్బణం 39నెలల గరిష్టంగాఉంది. ఫిబ్రవరిలో 6.55శాతంగా నమోద యింది. రిటైల్‌ద్రవ్యోల్బణం మాత్రం ఆరునెలల దిగువకు చేరింది. ఆహార ఉత్పత్తులదరలతో కొంత పెరిగినట్లు అంచనా. రిటైల్‌ద్రవ్యోల్బణ గణాంకాలు ఈరోజే విడుదలవుతాయి. ఇక్రా ప్రిన్సిపల్‌ ఆర్థిక వేత్త ఆదితినాయర్‌ సిపై ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.2శాతం నుంచి 3.9శాతానికి పెరగవచ్చని అంచ నా వేసారు. దీనితో టోకుధరలసూచీ, రిటైల్‌ధరల సూచి ద్రవ్యోల్బణాలు మధ్య తేడా కూడా భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆహార ఉత్పత్తులధర లే ఎక్కువ భారంగా ఉన్నాయి.సిపిఐ ద్రవ్యోల్బణం లో 45శాతంగా ఉన్నాయి. అదే టోకుధరలసూచీ లో చూస్తే 14.3శాతంగా ఉన్నాయి. దీనివల్ల టోకు ధరల సూచీలో ఆహారద్రవ్యోల్బణం 1.3శాతం నుంచి ఐదుశాతానికి పెరుగుతుందని తృణధాన్యా లు, పండ్లు మరింత ఖరీదైనవిగా ఉంటాయని అం చనా వేసారు. ఇక కూరగాయలపరంగాచూస్తే ధర లు తగ్గాయి. ఎనిమిదిశాతానికి తగ్గాయి. జనవరిలో 32.3శాతం నుంచి ఫిబ్రవరిలో 8 శాతానికి తగ్గాయి. పప్పుదినుసులు కూడా 6.2శాతం నుంచి 0.8శాతా నికి తగ్గాయి. ఇక ఆహారేతర ఉత్ప త్తుల కేటగిరీలో ఫైబర్‌, ఖణిజవన రులు ద్రవ్యోల్బణం ఫిబ్రవరినెలో 6.5శాతంగా ఉన్నాయి. ఇంధన ఉత్పత్తులు ఖరీదైనవిగా మారాయి. 18.1శాతం నుంచి 21శాతానికి పెరిగాయి. ఇక తయారీ రంగ ఉత్ప త్తులు ద్రవ్యోల్బణం 3.99 శాతం నుంచి 3.66శాతానికి తగ్గాయి. ఫిబ్రవరిలో డాలరుతో రూపాయి పటిష్టం అయిందని, జనవరికంటే ఫిబ్రవరిలో పెరిగిందన్నారు. దీని వల్ల ఈ ఉత్పత్తులు దిగుమతులు చౌకగా మారాయని, డాలర్‌ రూపాయికి 68.1 రూపాయలుగా జనవరిలో చెలామణి అయింది. ఫిబ్రవరిలో 66.9గా మారింది. ఇక అంతర్జాతీయం గా మెటల్‌ధరల ధోరణులు మిశ్రమంగా ఉన్నాయి