38 నగరాలకు డీజిల్‌ డోర్‌డెలివరీ

diesel
diesel

ఆయిల్‌మార్కెటింగ్‌కంపెనీల విస్తరణ వ్యూహం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వరంగంలో ఉన్న మూడు ఆయిల్‌ మార్కెటింగ్‌కంపెనీలు ప్రయోగాత్మకంగా మొత్తం 38 నగరాల్లో డీజిల్‌ను ఇంటికే చేరవేసే ప్రనాళికను అమలుచేస్తున్నాయి. మార్చినాటికి ఈసేవలు విస్తరిస్తామని చెపుతున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌పెట్రోలియం కంపెనీలు డీజిల్‌ను ఇప్పటికే తొమ్మిదినగరాల్లో డోర్‌ డెలివరీచేస్తున్నాయి. పూణె, ఢిల్లీ, జాన్‌పూర్‌, చెన్నై, బెంగళైరు, ఆలిఘర్‌, రేవారి, ఉద§్‌ుపూర్‌, నవీముంబయి నగరాల్లో జరుగుతోంది. జనవరి నెలాఖరునాటికి ఈ సౌకర్యాన్ని మరో ఎనిమిది నగరాలకు విస్తరిస్తామని, మార్చినెలాఖరునాటికి 30 నగరాలకు పెరుగుతుందని మూడు కంపెనీలు ప్రకటించాయి. గత ఏడాది ప్రారంభించిన ఈ సేవలకు నవీముంబయిలో అత్యధికంగా పంపిణీ జరిగింది. నెలకు 150 కిలోలీటర్లు డెలివరీచేసారు. ఇతర నగరాలు 40-50 కిలోలీటర్లుచొప్పున పంపిణీచేసినట్లు సమాచారం. కస్టమర్లు కనీసం 200 లీటర్లను ఒకసారి కొనుగోలుచేసేవీలుంది. పెట్రోలియం, పేలుడుసామగ్రి భద్రతాసంస్థ ఇంకా క్లియరెన్సులు జారీచేయాల్సి ఉంది. ఇంటికి పెట్రోలు పంపిణీచేసేందుకుసైతం నిర్ణయించారు. సంస్థలు చిన్న ట్యాంకర్లనువినియోగించి డోర్‌డెలిరీచేస్తాయి. వీటికి ఫ్యూయల్‌ డిస్పెన్సర్లను సైతం అమలుచేస్తాయి. ఒక్కొక్క కస్టమరు 25000 లీటర్లకు మించి కొనుగోలుచేయాలంటే పిఇఎస్‌ఓ క్లియరెన్సులు అవసరం అవుతాయి. ఇండియన్‌ ఆయిల్‌ ఈ స్కీంకు ఫ్యూయెల్‌ఎట్‌ డోర్‌స్టెప్‌గా బ్రాండింగ్‌ చేసింది. ఒక్క డిసెంబరునెలలోనే డీజిల్‌ వినియోగం 7.1 మిలియన్‌ టన్నులకు చేరింద.ఇ ఏప్రిల్‌నుంచి డిసెంబరువరకూ గత ఏడాది 2.6శాతం చొప్పున వినియోగం పెరిగింది. గత ఏడాది డీజిల్‌ విక్రయాలు 6.6శాతంపెరిగి 81.073 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది 76.027మిలియన్‌ టన్నులతో పోలిస్తే ఎక్కువే. కిరీట్‌పరేఖ్‌ ఆధ్వర్యంలోని కమిటీ ప్రస్తుత మార్కెటింగ్‌ మార్గదర్శకాలను పరిశీలిస్తోంది. అంతేకాకుండా మరింత సమర్ధవంతంగాపనిచేసేందుకువీలుగా డీజిల్‌ పెట్రోలు ఉత్పత్తులను సమీపంలోని హైపర్‌మార్కెట్‌లను వినియోగించాలనిచూస్తోంది. ప్రస్తుతం బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో కూడా ఇదే అమలవుతోంది. సూపర్‌మార్కెట్‌కంపెనీలు టెస్కో, సెయిన్స్‌బరీ, ఆస్డా, మారిసన్‌లు 45శాతం మొత్తం విక్రయాలు చేస్తున్నాయి. ఈ ఆలోచన కూడా రిటైల్‌రంగానికి వర్తింపచేయాలని ఒఎంసిలు యోచిస్తున్నాయి. ప్రస్తుతం భారత్లఓ 64,050 ఇందన రిటైల్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి.ఐఒసి 27,459 కాగా బిపిసిఎల్‌ 14,651, హెఛ్‌పిసిఎల్‌ 15,357 ఔట్‌లెట్లుత నిర్వహిస్తోంది. నయరా ఎనర్జీ 5033 ఔట్‌లెట్లు, ముకేష్‌ అంబాని రిలతయన్స్‌ 1400 ఔట్‌లెట్లు, షెల్‌ 144 ఔట్‌లెట్లు కొనసాగుతున్నాయి. మరో ఆరునగరాల్లో రిటైల్‌ప్రైవేట్‌ సంస్థలుసైతం నిర్వహిస్తున్నాయి.