27% పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

DOLLAR
DOLLAR

27% పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

న్యూఢిల్లీ, జనవరి 4: భారత్‌ కార్పొరేట్‌ రంగానికి విదేశీ పెట్టుబడులు 27శాతంపెరిగాయి. ఏప్రిల్‌ అక్టో బరు మధ్యకాలంలో 27.82 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అందినట్లు ప్రభుత్వ గణాంకాలు చెపుతు న్నాయి. గత ఏడాది ఇదేకాలంలో 21.87 బిలియన్‌ డాలర్లు అందితే ఈ ఏడాది 27శాతంపెరిగాయని కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక మండలి ప్రకటించింది. విదేశీ నిధులకుగాను సేవలు, టెలికాం, ట్రేడింగ్‌; కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ ఆటోమొబైల్‌ రంగా ల్లో ఈ పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి. సింగపూర్‌, మారిషస్‌, నెదర్లాండ్స్‌, జపాన్‌ దేశాలనుంచి ఎక్కువ పెట్టుబడులు అందాయి. గత ఏడాది పెట్టుబడుల పరంగాచూస్తే అంతకుముందు సంవత్సరంతోపోలిస్తే 23శాతంపెరిగి 55.6 బిలియన్‌ డాలర్లు అందాయి. భారత్‌ విదేశీ పెట్టుబడులే కీలకంగా మారాయి. లక్ష కోట్ల డాలర్ల వరకూ మౌలికవనరుల రంగానికి అవస రం అవుతోంది. ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, హైవేల నిర్మాణానికి ఈ నిధులు అవసరం అవుతాయి. ఈ పెట్టుబడుల రాకవల్ల దేశ చెల్లింపుల సమతుల్యత మరింతపటిష్టం అవుతుందని, అలాగే ఇతర ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువలను కూడా పటిష్టంచేస్తుందని, ప్రత్యేకించి డాలరుతో రూపాయి మారకం విలువలు మరింతగా స్థిరపడతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇక ట్రేడ్‌మార్క్‌లపరంగా చూస్తే మూడునెలల పెండింగ్‌ వచ్చే మార్చినాటికి నెలరోజుల పెండింగ్‌కు తగ్గిస్తామని డిఐపిపి చెపుతోంది.