26 శాతం పెరిగిన టివిఎస్‌ అమ్మకాలు

TVS
TVS

26 శాతం పెరిగిన టివిఎస్‌ అమ్మకాలు

చెన్నై,అక్టోబరు 3: టివిఎస్‌ మోటార్‌ కంపెనీ సెప్టెంబరునెల విక్రయాలు 26శాతం పెరిగాయని క్రపటించింది. మొత్తంగా చూస్తేకంపెనీ గతనెలలో 2,93,257 యూనిట్లను విక్రయిం చింది. గత ఏడాది ఇదే నెలలో 2,32,744 యూనిట్లను విక్రయించింది. పంపిణీ వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం వల్ల 25వేల యూనిట్ల ఉత్పత్తిని కోల్పోయామని టివిఎస్‌ ప్రకటించింది. మొత్తం టూవీలర్‌ విక్రయాల పరంగా చూస్తే 30శాతంపెరిగి 2,87,449యూనిట్లుగా ఉన్నాయి. గతఏడాది ఇదేనెలలో 2,20,971 యూని ట్లు విక్రయించామని వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో 2,53,974యూనిట్లు విక్రయించిన కంపెనీ గత ఏడాది 1,90,063 యూనిట్లు మాత్రమే విక్రయించింది. 33.62శాతం వృద్ధిని సాధించింది. మోటార్‌ సైకిల్‌ విక్రయాలపరంగాచూస్తే 35.9శాతం పెరిగి 1,22,813యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో 90,393యూనిట్లు విక్రయించిందని వివరించింది. స్కూటర్ల విక్రయాలపరంగాచూస్తే 12.7శాతం వృద్ధిని సాధించింది. 75,307యూనిట్ల నుంచి పెరిగి 84,850యూనిట్లు విక్రయించింది. ఎగుమతులపరంగాచూస్తే 38,164యూనిట్లు చేసింది. అయితే గతఏడాదితోపోలిస్తే 7.89శాతం క్షీణిం చాయి. గతఏడాదిసెప్టెంబరులో 41,435యూనిట్లు ఎగుమతి చేసినట్లు కంపెనీ బిఎస్‌ఇకి నివేదిక ఇచ్చింది.