25శాతం పెరిగిన ఎస్‌బ్యాంకు లాభాలు

Yes Bank
Yes Bank

న్యూఢిల్లీ: దేశంలో ఐదవ అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బ్యాంకు లాభాలు రెండో త్రైమాసికంలో 25శాతం పెరిగాయి.
అయితే ఇది మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా లేకపోవడం గమనార్హం. మొండిబకాయిలు పెరగడమే బ్యాంకు లాభాలు ఆశించిన
స్థాయిలో లేవని భావిస్తున్నారు. క్రితం ఏడాది రెండో త్రైమాసికంలో బ్యాంకు 802కోట్ల రూపాయల నికరలాభం ఆర్జించగా, ఇప్పుడు
అది రూ.1,003కోట్లకు పెరిగింది. మరోవైపు క్రితం ఏడాది నిరర్ధక ఆస్తులు ఇదే త్రైమాసికంలో 0.83శాతం ఉండగా, ఇప్పుడు 0.97శాతానికి
పెరిగాయి.