ఇన్వెస్ట‌ర్ల ఆశాకిర‌ణం ఇన్పోసిస్‌

INFOSYS
INFOSYS

న్యూఢిల్లీ: భారతదేశంలో అతిపెద్ద ఐటి కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతునన ఇన్ఫోసిస్‌ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఐపిఒగా 13 జూన్‌ 1993లో లిస్టింగ్‌ అయ్యింది. భారతీయ టెక్నాలజీ రంగంలో అంచెలంచెలుగా ఎవరెస్టు ఎత్తుకు ఎదిరిన ఇన్ఫోసిస్‌ ఇన్వెస్టర్లకు బంగారుబాతు లాంటిది. పాతికేళ్ల క్రితం మార్కెట్‌కు వచ్చిన ఇన్ఫోసిస్‌ కంపెనీ షేర్లు కొనుగోలు చేసి అట్టిపెట్టుకున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. ఐటిరంగంలో దూసుకెళ్తున్న ఇన్ఫోసిస్‌ అటు న్యూయార్క్‌లోని నాస్‌డాక్‌లోనూ 1999లో లిస్టైన ఇన్ఫోసిస్‌ తొలి భారతీయ సంస్థగా రికార్డు నెలకొల్పింది. కాగా దేశీయ మార్కెట్‌లోని బాంబే స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో లిస్టైన సంస్థలలో ఇన్ఫోసిస్‌ విలువ ప్రస్తుతం రూ.2,78,443 కోట్లుగా ఉంది. అలాగే కేవలం 25 ఏళ్ల క్రితం రూ.95తో మొదలైన ఇన్ఫోసిస్‌ షేరు విలువ ప్రస్తుతం రూ.1275 వద్ద కదలాడుతోంది. భారత దేశ టెక్నాలజీ నిపుణులను ప్రపంచ స్థాయిలో అందిస్తూ అనతికాలంలో మంచి పేరు తెచ్చుకున్న ఇన్ఫోసిస్‌ జూలై 2, 1981న పుణెలో నారాయణ మూర్తితో పాటు నందన్‌ నిలేకని, రాఘవన్‌, క్రిస్‌ గోపాలక్రిష్టన్‌, షిబులాల్‌, దినేష్‌, అశోక్‌ అరోరాలు స్థాపించారు. ఇన్ఫోసిస్‌ మొదటి పెట్టుబడి ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. నారాయణ మూర్తి ఆయన భార్య సుధా మూర్తి వద్ద నుంచి రూ.10,000 అప్పుగా తీసుకొని ఇన్ఫోసిస్‌ స్థాపించారు. మొదట సంస్థను సంయుక్తంగా ఇన్ఫోసిస్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా నామకరణం చేశారు. పుణె ఉత్తర మధ్య భాగంలో ఉన్న మోడల్‌ కాలనీలోని రాఘవన్‌ ఇంటిని రిజిస్టర్డ్‌ కార్యాలయంగా ఉపయోగించారు. ఆ తర్వాత 1982లో ఇన్ఫోసిస్‌ని బెంగళూరులో ప్రారంభించారు. అదే ఆ తర్వాత ప్రధనా కార్యాలయంగా మారింది. ఇన్ఫోసిస్‌కి ప్రస్తుతం భారత దేశంలో 9 డెవలప్‌మెంట్‌ సెంటర్లు, ఇతర దేశాల్లో 34 కార్యాలయాలు ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద ఐటి సంస్థల్లో ప్రస్తుతం సుమారుగా 2 లక్షలకు పూగా మంది నిపుణులను కలిగి ఉంది. దీని కార్యాలయాలు 22 దేశాలలో ఉన్నాయి. అలాగే అభివృద్ధి కేంద్రాలు భారతదేశం, చైనా, ఆస్ట్రేలియా, లండన్‌, కెనడా మరియు జపాన్‌లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌ స్టాక్‌ మార్కెట్లలో అరేంగట్రం చేసే సంవత్సరం ముందే, 1992లో సెబిని స్థాపించారు. అంతకు ముందే హర్షద్‌ మెహతా కుంభకోణం నుంచి మార్కెట్లు కోలుకుంటున్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఇన్ఫోసిస్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇన్ఫోసిస్‌ స్టాక్‌ మార్కెట్లలోకి 1993వ సంతవ్సరంలో వెళ్లగా, మొదట్లో ఇన్ఫోసిస్‌ ఐపిఒ అండ్‌ సబ్‌స్రైబ్‌ అయింది. కానీ యూఎస్‌ పెట్టుబడి బ్యాంకు మోర్గాన్‌ స్టాన్లీ ఒక్కో వాటాకు రూ.95 చెల్లించి 13శాతం ఈక్విటీ తీసుకుంది. లిస్టింగ్‌ రోజు ఇన్ఫోసిస్‌ రూ.145 వద్ద లిస్ట్‌ అయ్యింది. సరిగ్గా ఆరు సంవత్సరాలు అంటే 1999 నాటికి ఇన్ఫీ షేరు ధర రూ.8,100లకు చేరింది. దాదాప 85 రెట్లుపెరిగింది. ఆ సమయంలో మార్కెట్‌లో అతి విలువైన షేరుగా ఇన్ఫోసిస్‌ పేరు పొందింది. ఆ సమయంలో, ఇన్ఫోసిస్‌ నాస్‌డాక్‌లో 20 అతిపెద్ద సంస్థలలో ఒకటైన అడోబ్‌ సిస్టమ్స్‌, నోవెల్‌, లికోస్‌ కన్నాచాలా ముందంజలో ఉంది. ఒక పత్రిక కథనం ప్రకారం ముంబై స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో జాబితా కాబడినప్పటి నుంచీ 2000 సంవత్సరం వరకు, ఇన్ఫోసిస్‌ రెవెన్యూలు కలిపి సంవత్సరానికి 70 శాతంపైనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్‌ బిల్‌ క్లింటన్‌ ఐటి రంగంలో సాధిస్తున్న భారతీయ అద్భుతంగా ఇన్ఫోసిస్‌ని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2009లో, ఫోర్ట్స్‌ ఇన్ఫోసిస్‌ను ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్‌ , సేవల రంగాలలో పనిచేస్తున్న ఉత్తమ 5 సంస్థలలో ఒకటిగా పేర్కొంది.