23వేల ఉద్యోగులను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నం

jet airways
jet airways

న్యూఢిల్లీ, : జెట్‌ ఎయిర్‌వేస్‌ను సంక్షోభం నుంచి బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం ప్రయాత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందిన కొన్ని విమానాలను తీసుకోవాల్సిందిగా స్పైస్‌ జెట్‌ను అడిగిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందని 40 విమానాలు తీసుకునేందుకు స్పైస్‌జెట్‌ రెడీగా ఉంది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చెబుతున్నారు. మిగతా విమానయాన సంస్థలతోను కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. జెట్‌ఎయిర్‌వేస్‌లో 23 వేల ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ మూతబడితే ఉద్యోగులు రోడ్డుపాలవుతారు. ఎన్నికలకు ముందు ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా, వారి ఉద్యోగాలు కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇటీవలి వరకు ఇండియాలో రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ సంస్థ జెట్‌ఎయిర్‌వేస్‌. ఇప్పుడు రుణాలతో సతమతమవుతోంది. బోయింగ్‌ కంపెనీకి చెందిన 737 విమానాలను స్పైస్‌జెట్‌, జెట్‌ఎయిర్‌వేస్‌ మాత్రమే నడుపుతున్నాయి. స్పైస్‌జెట్‌ బిజినెస్‌, ఎకనామీ కేటగిరీల్లో విమానాలను నడిపిస్తోంది. విమానాలను తీసుకునే అంశంపై స్పైస్‌జెట్‌, జెట్‌ఎయిర్‌వేస్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయరడి :