220బిలియన్‌ డాలర్లకు చేరిన రానిబాకీలు

CHAINA CURRENCY111
CHAINA CURRENCY111

220 బిలియన్‌ డాలర్లకు చేరిన రానిబాకీలు

బీజింగ్‌: చైనా రానిబాకీలు మొత్తంగా చూస్తే గత ఏడాది 220 బిలియన్‌డాలర్లకు చేరా యి. ప్రాదేశిక ప్రభుత్వాలే ఎక్కువగా వీటికి కారణం అన్నట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థ నివేదికలు స్పష్టంచేస్తు న్నాయి. మౌలిక వనరులు పెంపొందించుకోవాలన్న తాపత్రయమే రానిబాకీలను పెంచిందని బ్యాంకింగ్‌ రంగ నివేదికలు స్పష్టంచేసాయి.

మొత్తం 1794 బ్యాంకులుంటే వాటిలో 90 శాతం వరకూ రానిబాకీల వసూళ్లకు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ పటిష్టంగా లేదు. ప్రభు త్వరంగంలోని అధికార వార్తాపత్రిక గ్జిన్‌ హువా చైనా బ్యాంకింగ్‌ అసోసియేషన్‌, ప్రైస్‌ వాటర్‌కూపర్స్‌ రూపొందించిన నివేదికను విశ్లేషించింది. వాణిజ్యబ్యాంకుల్లో రానిబాకీలు 220 బిలియన్‌డాలర్లు అదే చైనా కరెన్సీ యువాన్‌లో చూస్తే 1.5లక్షల కోట్లుగా ఉన్నా యి. మూడోత్రైమాసికం చివరినాటికి 18.3 బిలియన్‌ యువాన్‌లు మరింత పెరిగాయి. సుమా రు 78శాతం బ్యాంకర్లు తమ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ను పెంచుకుంటున్నాయి. 61శాతం సర్దుబాటు బిజినెస్‌ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేసుకుంటున్నట్లు ఉటంకించింది.

పట్టణ మౌలికవనరుల ప్రాజెక్టులకే చైనాలో ఎక్కువ రుణపరపతి అందింది. తర్వాత వైద్యరంగానికి ఎక్కువ రుణాలు జారీ అయ్యాయి. ఎక్కువ రానిబాకీల్లో అధికశాతం ప్రాదేశిక ప్రభు త్వాల నుంచే అందాల్సి ఉంది. తమ అభివృద్ధిని మరింతగా పెంచుకోవాలన్న తాపత్రయంతో ఈ ప్రభుత్వాలు మౌలికవనరులకోసం అత్యధిక రుణా లు తీసుకున్నట్లు సర్వేలో తేలింది. చైనా బ్యాం కులు రుణపరపతితోపాటే అసెట్‌మేనేజ్‌మెంట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ను కూడా నిర్వహిస్తాయి. సిరిసంపదలు ఎక్కువ ఉన్న వ్యక్తులు, చిన్న వ్యాపా రాలు, ప్రభుత్వ శాఖలు వంటివి వీటికి కీలకమైన గ్రూప్‌లుగా ఉంటాయి. గత ఏడాది ఐఎంఎఫ్‌కు చెందిన సీనియర్‌ ఉద్యోగి ఒకరు పెరుగుతున్న కార్పొరేట్‌ రుణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేనిపక్షం లో రుణభారం మరింత పెరుగు తుందని హెచ్చరించారు.
చైనా సంస్కరణల్లో అత్యంత కీలకమై నది ముందు కార్పొరేట్‌ రుణ భారం తగ్గించుకోవడమేనని లేని పక్షంలో తీవ్రస్థాయి ఆర్థిక సమస్య లు ఉత్పన్నం అవుతాయని ఐఎం ఎఫ్‌ మొదటి డిఫ్యూటీ ఎండి డేవిడ్‌లిప్టన్‌ వెల్లడించారు. మొత్తం జిడిపిలో225శాతంగాఉందని కార్పొ రేట్‌ రుణభారం 145శాతం వాటాతో ఉందని, అత్యం త తీవ్రస్థాయిలో ఉందని హెచ్చరించింది. అంతే కాకుండా చైనా కార్పొరేట్‌రుణభారం తీవ్రంగా పరిగ ణించాలని లిప్టన్‌ ఆదేశ పాలకులను హెచ్చరించారు.