19.3% పెరిగిన ప్రత్యక్ష పన్నులవసూళ్లు

TAX
TAX

న్యూఢిల్లీ: ప్రత్యక్షపన్నుల వసూళ్లపరంగా జనవరినెలలో 19.3శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే మరింతగాపెరిగినట్లు అంచనా. కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు అంచనాలప్రకారం ప్రస్తుత సంవత్సరంలో రూ.6.95 లక్షలకోట్లు వసూలు కావాల్సి ఉంది. గత నెల చివరినాటికి 6.89 లక్షలకోట్లు వసూలయినట్లు తేలింది. నికర ప్రత్యక్ష పన్నులవసూళ్లు 69.2 శాతం సవరించిన అంచనాల లక్ష్యానికి చేరువగా ఉన్నాయి. మొత్తం సవరించిన అంచనాల్లో 10.05 లక్షలకోట్లుగా ఉన్నాయి. పన్నువసూళ్ల గణాంకాలను వివరిస్తూ రీఫండ్స్‌ సర్దుబాటుకు ముందు 13.3శాతంపెరిగి 8.21 లక్షలకోట్లుగా ఉన్నట్లు అంచనా. ఇక రీఫండ్స్‌పరంగా మొత్తం రూ.1.26 లక్షలకోట్లు జారీచేసినట్లు సిబిడిటి వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్‌నుంచి ఈ ఏడాది జనవరి చివరివరకూ రీఫండ్‌లను ఎప్పటికప్పుడు విడుదలచేసినట్లు సిబిడిటి వెల్లడించింది. కార్పొరేట్‌ ఆదాయపన్ను పరంగా 19.2శాతంపెరిగింది. అదే వ్యక్తిగత ఆదాయ పు పన్నుపరంగాచూస్తే 18.6శాతం పెరిగిందని సిబిడిటి వెల్లడించింది.