ఎనిమీ షేర్ల విక్రయం ద్వారా ఖజానాకు రూ.11,300కోట్లు,అసలు ఏమిటివి?

sell ,buy
sell ,buy

న్యూఢిల్లీ, : ఎనిమీ షేర్లను అమ్మడం ద్వారా భారత ప్రభుత్వానికి రూ.700కోట్లు వచ్చాయి. నవంబరు 2018లో కేంద్ర మంత్రివర్గం ఈ తరహా షేర్ల విక్రయానికి చర్యలు తీసుకోమని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగానికి సూచించింది. దీంతో ఆ విభాగం వివిధ కంపెనీల్లోని ఎనిమీ షేర్లను విక్రయించింది. ఈ షేర్లను అమ్మడంతో పాటు సిపిఎస్‌ఇలో బైబ్యాక్‌ ఆఫర్‌తో మరో రూ.10,600కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. దీంతో షేర్ల అమ్మకం, బైబ్యాక్‌ ద్వారా మొత్తం రూ.11,300కోట్లు సమకూరాయి. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం విధించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.80,000కోట్లను సులువుగా అధిగమించి రూ.85,000కోట్లు సమకూర్చుకుంది. భారత్‌ కూడా అదేదారిలో నడిచింది. 1962, 1965లలో చైనా, పాకిస్థాన్‌ దేశాలతో యుద్ధం జరిగినప్పుడు ఆయా దేశాలకు వెళ్లి తలదాచుకున్న వారి అన్ని రకాల ఆస్తులను డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరోవారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తోందిఇటిఎఫ్‌ ద్వారా షేర్ల విక్రయాన్ని చేపట్టి ప్రభుత్వం రూ.45,729కోట్లు రాబట్టుకుంది. ఆర్‌ఇసిలో 52.63శాతం ప్రభుతవ వాటాను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పిఎఫ్‌సి)కొనుగోలు చేసింది. దీంతో రూ.14,500కోట్ల ఆదాయం వచ్చింది. రైట్స్‌, ఎంఎస్‌టిసి, ఆర్‌ఐటిఇఎస్‌, ఇర్కాన్‌, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌, మిధాని వాటాల విక్రయం ద్వారా రూ.1,929కోట్లు సమీకరించింది. కోల్‌ ఇండియా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఒఎఫ్‌ఎస్‌) ద్వారా రూ.5,218కోట్లు, యాక్సిస్‌ బ్యాంకులో ఎస్‌యుయూటిల వాటా విక్రయం నుంచి మరో రూ.5,379కోట్లు వచ్చింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి మొదలయ్యే 2019-20 కొత్త ఆర్థిక సంవత్సరానికిగానూ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.80వేల కోట్లుగా కేంద్రం నిర్దేశించుకుంది.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/