10శాతం జీడీపీ వృద్ధి రేటు అతిపెద్ద సవాల్‌: జైట్లీ

arun jaitly2
arun jaitly

ఢిల్లీ: హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ఆరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10శాతం జీడీపీ వృద్ధి సాధించడమనేది సవాల్‌తో కూడకున్నదని ‘గత మూడేళ్లుగా జీడీపీ వృద్ధి 7-9శాతం ఉంటుంది. 10శాతం వృద్ధి రేటు సాధించడమనేది అతిపెద్ద సవాల్‌. ఇది ఒక్క దేశీయ పరిణామాలపైనే కాకుండా అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుందని జైట్లీ తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్మాణాత్మక సంస్కరణలకు ముగింపు ఉండదని అన్నారు. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను వేర్వేరు పన్ను రేట్ల కింద తీసుకొచ్చాం. దీంతో పాటు పలు వస్తువులపై విధించిన పన్ను రేట్లను సవరించామని, భవిష్యత్‌లో పన్ను విధానాల్లో మార్పులు దేశ ఆదాయంపై ఆధారపడి ఉంటుందన్నారు. 12శాతం, 18శాతం పన్ను శ్లాబులను విలీనం చేసే సంకేతాలను కూడా జైట్లీ ఇచ్చారు.