హైదరాబాద్‌కు వోక్స్‌వ్యాగన్‌ అమియో

Ameo
హైదరాబాద్‌ : వోక్స్‌వ్యాగన్‌ ఇండియా కొత్తగా విడుదల చేసిన అమియోకారు హైదరాబాద్‌కు ప్రవేశ పెట్టింది. 12వ అమియో రోడ్‌షోకు ఏర్పాట్లుచేస్తోంది. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూం ధరలుగా 5.41 లక్షల రూపాయలుగా ప్రకటించింది.12లీటర్లమూడు సిలిండర్‌ ఎంపిఐ ఇంజన్‌తోవస్తోంది. ముందుగా బుక్‌చేసుకునే సదుపాయం కూడా ఉంది. క్రూయిజ్‌ కంట్రోల్‌, వర్షపునీటి వైపర్లు, కేంద్రీకృత రెస్టింగ్‌, యాంటిపించ్‌ పవర్‌ విండోస్‌ వంటివి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఈనెల 24వ తేదీ నుంచి వోక్స్‌వ్యాగన్‌ మల్టీసిటీ రోడ్‌షో నిర్వహిస్తోంది. ట్రెండిలీఐన్‌ 5,41,521 రూపాయలు, కంఫర్ట్‌లైన్‌ 6,18,516 రూపాయలు, హైలేన్‌ ధరలు 7,26,350లుగా ఉన్నాయి.