హవ్వ..పన్నులు చెల్లించేది రెండుకోట్ల మందేనా?

TAX
TAX

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న మొత్తం 120 కోట్ల జనాభాలో కేవలం రెండుకోట్ల మంది భారతీయులు మాత్రమే ఆదాయపు పన్నును చెల్లిస్తుఆ్నరు. 2015-16 ఆర్ధికసంవత్సరం, అసెస్‌మెంట్‌ సంవత్సరంలో కేవలం రెండుకోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లించినట్లు ఐటిశాఖ వెల్లడించింది. 2015-16 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో రిటర్నులు దాఖలుచేసినవారు మాత్రం 4.07 కోట్లమంది వరకూ ఉన్నట్లు ఐటిశాఖ మదింపుచేసింది. అంతకుముందు సంవత్సరంలో 3.65 కోట్లు మంది రిటర్నులు వాఖలుచేస్తే వారిలో 2.06 కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లించినట్లు ఐటి శాఖ లక్ష్యాలకు అతితక్కువగా ఉన్నట్లు తేలింది. 2014-15 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో 3.65 కోట్లు మంది రిటర్నులు దాఖలుచేస్తే వారిలో 1.91 కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లించారు. మొత్తం ఆదాయపు పన్ను వ్యక్తిగతంగా చెల్లించినవారి సంఖ్యకూడా తగ్గింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 1.88 లక్షలకోట్లుకాగా అంతకుముందు సంవత్సరంలో 1.91 లక్షలకోట్లు వరకూ ఉన్నది.

గత వారంలో విడుదలయిన ఈ గణాంకాలను పరిశీలిస్తే 120 కోట్ల జనాభాలో కేవలం 3శాతం మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నట్లు తేలింది. వీరిలో 2.01 కోట్లమంది ఆదాయపు పన్నుపరిధిలోనే లేరు. 9690 మంది కోటిరూపాయలకుపైబడి పన్నులు చెల్లించే కేటగిరీలో ఉన్నారు. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే రూ.100 కోట్లపన్నులు చెల్లించారు. 2.80 కోట్ల మంది పన్నులు రిటర్నులు దాఖలుచేసిన వారినుంచి రూ.19,931 కోట్లు వసూలుచేసారు. వీరిలో 5.5 లక్షలు, నుంచి 9.5 లక్షలవరకూ పన్నులు చెల్లించారు. మొత్తంగాచూస్తే 1.84 కోట్ల రిటర్నులు ఆదాయపు పన్ను చెల్లించేందుకుగానురిటర్నులు దాఖలుచేస్తే వీరిలో రూ.24వేల నుంచి రూ.1.5 లక్షల వరకూ పన్నులు చెల్లించారు. 2015-16కు సంబంధించి 4.07 కోట్లమంది రిటర్నులు దాఖలుచేస్తే 82 లక్షలమంది తమకు 2.5 లక్షలకంటే తక్కువ ఆదాయం ఉందని చూపించారు.

ప్రస్తుతం 2.5 లక్షలవరకూ ఆదాయపు పన్నులేదు. 2014-15 అసెస్‌మెంట్‌ సంవతంలో 3.65 కోట్ల రిటర్నులు దాఖలయితే వీటిలో 1.37 కోట్లు రిటర్నులు రూ.2.5లక్షల ఆదాయానికి లోబడి ఉన్నట్లు వెల్లడి అయింది. మొత్తం వ్యక్తిగత పన్ను రిటర్నులు దాఖలుచేసినవారిలో మొత్తం రాబడులు రూ.21.27 లక్షలకోట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో రూ.18.41లక్షలకోట్లనుంచి కొంతమేర పెరిగింది. ఇక వివిధ కంపెనీలు 7.19 లక్షల రిటర్నులు దాఖలైతే వాటి స్థూల ఆదాయ వనరులు రూ.10.71 లక్షలకోట్లుగా ఉంది. దీన్నిబట్టిచూస్తే ఇప్పటికీ భారత్‌లో పన్నుల ఎగవేత యధేఛ్ఛగా కొనసాగుతోందని తెలుస్తోంది. ఆదాయపు పన్ను పరంగా ఎంతటి సంక్లిష్ట విధానాలు అమలుచేసినా తాము 2.5 లక్షల ఆదాయవనరులలోపే ఉన్నట్లు వ్యక్తిగత రిటర్నులు దాఖలుచేసేవారు చెపుతున్నారు.

మొత్తం జనాభా 120 కోట్లలో కేవలం రెండుకోట్లమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నట్లు తేలిందంటే ఎంతమేర యధేఛ్ఛగా పన్నుల ఎగవేత కొనసాగుతుందో స్పష్టంచేసుకోవచ్చు. పన్నులు చెల్లించేవారి సంఖ్యపెరిగిందని, గత ప్రభుత్వాలకంటే తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణల ఫలితంగానే దేశంలో పన్నులచెల్లింపుదారుల సంఖ్యపెరిగిందని వెల్లడి అయింది. ఇక కంపెనీలు 7.19 లక్షల రిటర్నులుదాఖలయితే వాటి స్థూల ఆదాయం రూ.10.7 లక్షలకోట్లుగా ఉంది. మొత్తం 1.33 కోట్ల రిటర్నుల్లో ఎక్కువశాతం మంది రూ.2.5 లక్షలనుంచి రూ.3.5లక్షల మంది మాత్రమే పన్నులు చెల్లించారు. మొత్తం4.35 కోట్ల రిటర్నుల్లో వారి మొత్తం రాబడులు రూ.33.62 లక్షలకోట్లుగా ఉన్నట్లు ఐటిశాఖ వివరించింది. అంతకుముందు సంవత్సరంలో 3.91 కోట్ల రిటర్నులు దాఖలైతే వారి మొత్తం రాబడులు రూ.26.93 కోట్లుగా ఉన్నాయని ఐటిశాఖ వెల్లడించింది.