స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌ జూమ్‌

WHEELS
WHEELS

ముంబై: యూఎస్‌ఎ నుంచి భారీ ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించడంతో స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 3 శాతం పెరిగి రూ.1294 వద్ద ట్రేడవుతోంది. మొదట ఒకదశలో రూ.1312 వరకూ పెరిగింది. ఉత్తర అమెరికాలోని ట్రక్‌ అండ్‌ ట్రైలర్‌ రీప్లేస్‌మెంట్‌ మార్కెట్‌ నుంచి 1.10 లక్షల స్టీల్‌ వీల్స్‌ సరఫరాకు భారీ ఆర్డర్‌ లభించినట్లు స్టీల్‌ స్ట్రిప్స్‌ పేర్కొంది. వీటిని 5 నెలల్లో సరఫరా చేయవలసి ఉంటుందని తెలియచేసింది. దీంతో 5 మిలియన్‌ డాలర్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు వివరించింది.