స్టీల్‌స్ట్రిప్స్‌ వీల్స్‌కు యూఎస్‌ ఆర్డర్‌!

WHEELS
WHEELS

న్యూఢిల్లీ: అమెరికా నుంచి స్టీల్‌ వీల్స్‌ సరఫరాకు ఆర్డర్‌ లభించినట్లు వెల్లడించడంతో స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో ప్రస్తుత ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 3.6శాతం పెరిగి రూ.1362వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.1365 వరకూ పెరిగింది. మొత్తం 9500స్టీల్‌ వీల్స్‌ సరఫరాకు యూఎస్‌ కస్టమర్‌ నుంచి ఆర్డర్‌ లభించినట్లు స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌ తాజాగా పేర్కొంది. ఇప్పటికే యూరోపియన్‌ ఆటో దిగ్గజాకు వీల్స్‌ సరఫరా చేస్తున్న కంపెనీ మరోవైపు యూఎస్‌ నుంచీ ఆర్డర్లు పొందుతుడటంతో ఈ కౌంటర్‌ జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.