స్టాక్ మార్కెట్ లాభాల జోరు

stock market
stock market

ముంబాయిః బ్యాంకులకు రూ. 2.11లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రప్రభుత్వం మంగళవారం ప్ర‌క‌ట‌న ప్ర‌భావంతో బుధ‌వారం స్టాక్ మార్కెట్లు లాభాల బాట‌లో ప‌యాణించాయి. ఈ ఉదయం 400 పాయింట్లకు పైగా లాభంతో 33,063 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒక‌దశలో 500 పాయింట్ల వరకూ లాభంతో దూసుకెళ్లింది. చివరకు 435 పాయింట్లు ఎగబాకి.. 33,042 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 88 పాయింట్ల లాభంతో 10,295 వద్ద ముగిసింది.