స్టాక్‌ మార్కెట్లపై ట్రేడ్‌వార్‌!

DALALSTR
DALALSTREET

ముంబయి: బెంచ్‌మార్క్‌ స్టాక్‌ మార్కెట్లు అమెరికా చైనా ట్రేడ్‌వార్‌తో స్తంభించాయనే చెప్పాలి. బిఎస్‌సి సెన్సెక్స్‌ 351.56 పాయింట్ల దిగువన 33,019.07 పాయింట్ల వద్దట్రేడింగ్‌ ముగిస్తే నిఫ్టీ 50 సూచీ 116.60 పాయింట్ల దిగువన 10,128.40 పాయింట్లవద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనా ఉత్పత్తులపై 50 బిలియన్‌ డాలర్లకు సుంకాలుప్రకటిస్తే అదే స్థాయిలో చైనా కూడా వివిధ అమెరికాకు చెందిన 106 ఉత్పత్తులపై 25శాతం సుంకాలు విధించింది. ఇంట్రాడేలో సైతం 30షేర్‌ సెన్సెక్స్‌ 398 పాయింట్లు దిగజారి 32,972.56 పాయింట్లవద్దకు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీసైతం 116.60 పాయింట్లు క్షీణించి 10,128.40 పాయింట్లవద్దకు చేరింది. అంతకుముందు 10,111.30 పాయింట్లనుంచి 10,279.85 పాయింట్లవద్దకు చేరింది. బిఎస్‌ఇలో అన్ని సూచీలు దిగువ ప్రాంతంలోనేముగిసాయి. మెటల్‌ 2.75శాతం, వినియోగరంగ ఉత్పత్తులు 2.55శాతం, బేసిక్‌మెటల్స్‌ 2.07శాతం, కేపిటల్‌గూడ్స్‌ 1.95శాతంచొప్పుననష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీలో ఆటోసూచీ 0.40శాతంపెరిగింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌సూచీలు 0.92శాతం, 1.01శాతంచొప్పున దిగజారాయి. సెన్సెక్స్‌లో టాటామోటార్స్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఆదానిపోర్టులు, సెజ్‌ లిమిటెడ్‌, హీరోమోటోకార్ప్‌ వంటివి లాభాల్లో నడిచాయి. అలాగే టాటాస్టీల్‌, యాక్సిస్‌బ్యాంకు, ఎల్‌అండ్‌టి, ఎన్‌టిపిసి సంస్తలు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు అత్యధికంగా ఆర్‌బిఐ ద్వైమాసిక వడ్డీరేట్ల సమీక్షపైనే దృష్టిసారించారు. గురువారం సమీక్ష వివరాలు వెల్లడికానున్నాయి. ఆర్ధికవేత్తలు, మార్కెట్‌నిపుణుల అంచనాలనుచూస్తే రెపోరేట్లు స్థిరంగానే ఉంటాయనిచెపుతున్నారు. కొత్త ఆర్ధికసంవత్సరంలో మొట్టమొదటి రెపోరేట్‌ సమీక్ష కావడంతో ద్రవ్యోల్బణం, ఆర్ధికవృద్ధి రికవరీ ఆధారంగానే రెపోరేట్లు ఉంటాయని అంచనా. మార్కెట్లు అమెరికా నిరుద్యోగ గణాంకాలపై కూడా ఎక్కువ దృష్టిపెట్టారు. నిరుద్యోగ గణాంకాలు మార్చినెలలో 4.1శాతం దిగజారాయి. ఇక యూరోప్‌లో స్టాక్స్‌యూరోప్‌600 సూచీ 1.2శాతం పడిపోయింద.ఇ బ్రిటన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ సూచీ 0.7శాతం జర్మనీడాక్స్‌ సూచీ 1.7శాతం చొప్పున దిగజారాయి. ఆసియా మార్కెట్లుసైతం మిశ్రమంగా ఉన్నాయి ఎస్‌అండ్‌పి 500సూచీ 1.9శాతం ఫ్యూచర్స్‌లో క్షీణించింది. ఐదునెలల కనిష్టస్థాయిలోఉంది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.479.18 కోట్ల విలువైన వాటాలను కొనుగోలుచేస్తే విదేశీ ఇన్వెస్టర్లుమాత్రం 376.51 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు తేలింది. మార్కెట్లుప్రధానంగా అమెరికా,చైనా వార్‌ఆధారంగానే నడిచాయని చెప్పాలి. అమెరికా సుమారు 1300కుపైగా చైనీ పారిశ్రామిక, రవాణా, వైద్య ఉత్పత్తులపై 25శాం సుంకాలు విధించింది. ట్రంప్‌ యంత్రాంగం సుమారు 50 బిలియన్‌ డాలర్లమేరచైనా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. ఇక ఆసియా మార్కెట్లపరంగా జపాన్‌నిక్కీ 0.13శాతం పెరిగి 27.26 పాయింట్లు మద్దతునిచ్చింది. ఆటోకంపెనీలు ఎక్కువ కొనుగోళ్లుజరిగాయి. అమెరికాలో ఆటో విక్రయాలు పటిష్టం కావడమే ఇందుకుకీలకం. టయోటా 0.13శాతంపెరిగింది. బ్యాంక్‌ స్టాక్స్‌సైతం ఒత్తిడికి లోనయ్యాయి.