సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు నికర లాభం రూ.110.52 కోట్లు

CURRENCY
కొచ్చిన్‌ : ప్రైవేటు రంగంలోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు రెండో త్రైమాసికంలో రూ.110.52 కోట్ల నికరలాభం ఆర్జించినట్లు ప్రక టించింది. ప్రైవేటురంగంలోని ఈ బ్యాంకరు అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 93.38 కోట్లు నికరలాభం ఆర్జించింది. మొత్తం ఆదాయ వనరులపరంగాచూస్తే బ్యాంకు 1596.08 కోట్లు ఆర్జించింది. అంతకుముందు ఏడాది 1526.19 కోట్లనుంచి కొంతమేర వృద్ధిని సాధించినట్లు స్టాక్‌ ఎక్ఛేంజిలకు నివేదిక ఇచ్చింది. బ్యాంకు నిరర్ధక ఆస్తుల పరంగా చూస్తే 3.96 శాతంగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో 2.24 శాతంనుంచి గణనీయంగా పెరిగాయి. నికర నిరర్ధక ఆస్తులు కూడా 2.77శాతంగా ఉన్నాయి. గత ఏడాది 1.39శాతం నుంచి కొంత పెరిగాయి. ఇతరత్రా రానిబాకీల కేటాయింపులు, తక్షణ ఖర్చుల కేటాయింపులు కూడా బ్యాంకు గత ఏడాది కేటాయింపులు రూ.67.47 కోట్ల నుంచి రూ. 128.33 కోట్లకు పెంచింది. సౌత్‌ ఇండియన్‌ బ్యాంకుషేర్లు బిఎస్‌ఇలో 2.42శాతం దిగువన రూ.24.15 వంతున ట్రేడింగ్‌ జరుగుతున్నాయి.