సోని 910 మిలియన్‌ డాలర్ల బైబాక్‌!

sony
sony

టోక్యో: జపాన్‌రాజధాని టోక్యోకేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సోనీకార్ప్‌ షేర్లు 6.7శాతం మార్కెట్లలోపెరిగాయి. దీనితో సోని సంస్థ 100 బిలియన్‌ యెన్‌ల అంటే 910 మిలియన్‌ డాలర్ల షేర్‌ బైబాక్‌ను ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజంగా ఉన్న కంపెనీ భారీ ఎత్తున బైబాక్‌కు ముందుకువచ్చింది. మొత్తం స్టాక్‌లో 2.4శాతం వాటాలను కొనుగోలుచేయాలనినిర్ణయించింది. జపాన్‌ టెలికామ్‌ టెక్నాలజీ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంకు గ్రూపకార్ప్‌ 600 బిలియన్‌ యెన్‌ల బైబాక్‌ను ప్రకటించిన నేపథ్యంలో సోని సంస్థ కూడా షేర్బఐబాక్‌కు ముందుకువచ్చింది. ప్రస్తుత సిఇఒ కనిచిరో యోసిదా ఆధ్వర్యంలో ఆర్ధికపరిపుష్టిని పెంచేందుకు నిర్ణయించింది. సిఎప్‌ఒనుంచి ఆయన సిఇఒగా గత ఏడాదే పదోన్నతిపొందారు. ప్లేస్టేషన్‌ బిజినెస్‌లో అమ్మకాలు మందగించిననేపథ్యంలో వార్షిక రాబడుల అంచనాలను కూడా కుదించింది. మూడున్నరేళ్లలో మొదటిసారి రాబడి అంచనాలను సోని తగ్గించింది. దీనివల్ల స్టాక్స్‌కూడా దిగజారాయి. గతవారంలోనేబైబాక్‌నుప్రకటించిన సోనీ తదనంతరం మార్కెట్లలో వారం మొత్తంగాచూస్తే 14శాతం దిగజారింది. 2017 అక్టోబరునాటి కనిష్టస్థాయిని నమోదుచేసింది. తర్వాత 2018లో షేర్లు 4.8శాతంపెరిగాయి. టోక్యో కేంద్రంగా ఉన్న కంపెనీ 6.3 బిలియన్‌యెన్‌ల సొంత స్టాక్‌ను 2004లోనే కొనుగోలుచేసింది. ప్లేస్టేషన్‌ సబ్సిడరీ సోని కంప్యూటర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాతృసంస్థలో యాపిల్‌ ఇంక్‌ చిప్‌మేకర్‌ ఇంటెల్‌ కార్ప్‌, నివిడియా కార్ప్‌లు క్షీణించిన అమ్మకాలపై కంపెనీని హెచ్చరించాయికూడా. చైనా ఆర్ధికవ్యవస్థ బ్రెగ్జిట్‌కారణంగా కూడా కొంత అనిశ్చితంగా ఉంది. ఇతరయూరోపియన్‌దేశాలపరిస్థితి కూడా అలాగే ఉంది.