సెల్ఫ్‌డ్రైవ్‌ వెంచర్‌లో టాటా-జూమ్‌కార్‌ టైఅప్‌

tata
tata

న్యూఢిల్లీ: టాటామోటార్స్‌,జూమ్‌కార్‌ విద్యుత్‌ వాహనాల లీజు వెంచర్‌లో సొంతడ్రైవింగ్‌వెంచర్‌కోసం చేతులు కలిపాయి. టాటా టిగార్‌ విద్యుత్‌కార్లను సెల్ఫ్‌డ్రైవ్‌ రెంటల్‌ప్లాట్‌పామ్‌కిందజూమ్‌కార్‌ సౌజన్యంతో పూణెలో అమలుచేసేందుకు నిర్ణయించాయి. విద్యుత్‌ వాహన విబాగం ప్రెసిడెంట్‌ వూలేష్‌ చంద్ర, జూమ్‌కార్‌ వ్యవస్థాపక సిఇఒ గ్రెగ్‌మోరాన్‌లు మొదటి విడత టిగార్‌ విద్యుత్‌ వాహనాలను పూణెలో ప్రారంబించారు. టాటా టిగార్‌ విద్యుత్‌కార్లు సెల్ఫ్‌డ్రైవ్‌ రెంటల్‌ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంటాయని జూమ్‌కార్‌ వెల్లడించింది. కర్బన ఉద్గారాలు లేని వాహనాలుగా విద్యుత్‌కార్లకు పేరుండటంతో ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తున్నారని వెల్లడించారు. టాటామోటార్స్‌ కలిసివచ్చే భాగస్వాములతో ఇందుకు సంబంధించిన విభాగాన్ని విస్తరించాలనినిర్ణయించినట్లు వెల్లడించారు. దేశంలోని మొత్తం 20 నగరాల్లో 500 వరకు విద్యుత్‌ వాహనాలను టాటాభాగస్వామ్యంతో కలిపి వచ్చే ఏడాది విస్తరించనున్నట్లు జూమ్‌కార్‌ సిఇఒ వెల్లడించారు.