సెన్సెక్సె@ 39000

sensex2
sensex

సెన్సెక్సె@ 39000

మోర్గాన్‌ స్టాన్లీ అంచనా

ముంబయి, మే 14: అంతర్జాతీయ ఆర్థికసేవల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ సెన్సెక్స్‌ భారీ స్థాయికి వృద్ధిచెందుతుందని అంచనావేసింది. బుల్‌కేస్‌ సంవత్సరంగా పేర్కొంటూ బిఎస్‌ఇ ఎక్ఛేంజి బెంచ్‌మార్క్‌సెన్సెక్స్‌ ఈ ఏడాది 39వేల పాయింట్లకు చేరుతుందని వెల్లడిం చింది. గతంలో రికార్డుస్థాయికి 33 వేల పాయింట్లకు చేరింది. భారతీయ మార్కెట్లు సరికొత్త గరిష్టస్థాయికి పెరుగుతుండటం వల్లనే ఇది సాధ్యం అవుతుందని, బ్రోకరేజి సంస్థ వెల్లడించింది. కార్పొరేట్‌ సంస్థల ఆర్థికఫలితాలు, ఈక్విటీ మార్కెట్లకు నిధుల రాక వంటివాటితోపాటు దేశీయ ఇన్వెస్టర్లు కూడా మార్కెట్‌ ర్యాలీకి కీలకం అవుతారని అంచనా వేసింది.సెన్సెక్స్‌ శుక్రవారం 30,188 పాయింట్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఇదేతీరు కొనసాగితే 30శాతం పెరిగి మరింత వృద్ధికి ఆస్కారం కలుగుతుందని, మోర్గాన్‌ స్టాన్లీ మాత్రం 29శాతం ఎగువస్థాయిలోనే మార్కెట్ల కదలిక ఉంటుందని అంచనావేసింది. డిసెం బరు చివరినాటికి అంటే వచ్చే ఏడునెలల కాలంలో 39వేల పాయింట్లకు చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇది కేవలం కొత్త వృద్ధి వలయం ప్రారంభం మాత్రమేనని ఆర్థిక ఫలితాలు 20శాతం వార్షిక పద్ధతి లో వృద్ధిని తెస్తాయని వచ్చే ఐదేళ్లలో ఇదేతీరు ఉం టుందన్నారు. ఈక్విటీస్‌, దేశీయ కుటుంబ వాసులు రిటైల్‌ ఇన్వెస్టర్లు, విలీనాలు కొనుగోళ్ల కార్యకలాపాలు కూడా మార్కె ట్లను మరింత ముందుకు తీసుకువెళతాయని మోర్గాన్‌ స్టేన్లీ ఎండి రిధమ్‌ దేశాయి వెల్లడించారు. బేస్‌ స్థాయిలో అవకాశం 50శాతంగా ఉంటుందని, సెన్సెక్స్‌33 వేల పాయింట్లకుచేరుతుందని 9.3 శాతం గరిష్టంగా ఉంటుందని, బేర్‌ స్థాయిలో అయితే అవకాశం 20శాతంగా ఉంటుందని, సెన్సెక్స్‌ 24వేల పాయింట్లుగా ఉంటుందని, అంటే 20.5శాతంప్రస్తుత స్థాయి నుంచి పతనం చవిచూస్తుందని అంచనావేసారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్‌ మార్కెట్ల విలువలపరంగా ప్రత్యేకమని మోర్గాన్‌ అంచ నా వేసింది. ఉదాహరణకు అమెరికా మార్కెట్లు భారత విలువల పరంగా చూస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. భారత్‌పరంగా చూస్తే ప్రీమియంవిలువలు ఉంటాయి. వర్ధమానమార్కెట్లతో పోలిస్తే ఈక్విటీ రిటర్నులు కూడా మెరుగ్గా ఉంటాయని వెల్లడించారు. వర్ధమాన మార్కెట్లతో భారత్‌ను పోలిస్తే భారత్‌ సుసంపన్నంగా ఉంటుందని, సెన్సెక్స్‌ ఇప్పటికీ కొనుగోళ్ల జోన్‌లోనే ఉంటుందని,స్థానిక బాండ్లు పరంగా మంచి ప్రోత్సాహకరంగా ఉంటాయని అంచనా వేసింది. అయితే మిడ్‌క్యాప్‌ షేర్లు మాత్రం కొంత ఒత్తిడి తెస్తాయన్నారు.

ఇక కమోడిటీ ధరల్లో భారీ పెరుగుదల జిఎస్‌టి అమలుతో వచ్చే ప్రతికూల ప్రభావం, అంతర్జాతీయ అనిశ్చితి వంటివి రానున్న కొంతకాలం మార్కెట్లకు శిరోభారంగా ఉంటాయి. ఆర్థికరంగం, వినియోగ రంగాలపై బ్రోకరేజి సంస్థ అంతగా ధీమా వ్యక్తం చేయలేకపోతోంది. వినియోగరంగానికి సంబంధించి వాస్తవ ఆదాయవనరులు, ఉపాధిలో రికవరీ కొంత సానుకూలం చేస్తుందని అంచనా.

ఆర్ధికరంగపరంగా బ్యాంకులు ద్రవ్యవినిమయంలో మరింత అందు బాటులోకి రావాలి. నగదు చేరువచేయాల్సి ఉంటుం ది. దీనివల్ల రుణవృద్ధి పెరుగుతుందని అంచనా వేసింది. బ్యాంకుల మార్జిన్లు మాత్రం వత్తిడితో ఉంటాయి. నాన్‌బ్యాంకింగ్‌ సంస్థలు, స్థిరాస్థి కంపెనీ లు మాత్రం ఆశాజనకంగా ఉంటాయని మార్జిన్ల పరంగా మెరుగుపడతాయని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. రుణ వ్యయాలు కూడా తగ్గుతాయి. విలీనాలు కొనుగోళ్లపరంగా కొంత ఆర్ధికవృద్ధికి మద్దతునిస్తుందని రిధమ్‌దేశాయి వివరించారు. అయితే ఐటిరంగాన్ని బ్రోకరేజి సంస్థ మోర్గాన్‌ స్టేన్లీ అత్యధిక భారం ఉన్న రంగంగా అంచనావేసింది. ఇప్పటికే 30వేల పాయింట్లు అధిగమించిన సెన్సెక్స్‌ 33 వేల పాయింట్లు దాటడం ఏమంత కష్టం కాదని దేశీయ బ్రోకరేజి సంస్థలు చెపుతున్నాయి.