సుజ్లాన్‌ రాబడుల్లో 76% వృద్ధి

b8
Suzlon

సుజ్లాన్‌ రాబడుల్లో 76% వృద్ధి

పుణె,: పవనవిద్యుత్‌ ఉత్పత్తిరంగంలో అగ్ర గామిగా ఉన్న సుజ్లాన్‌ ఎనర్జీ 3వ త్రైమాసికం రాబడుల్లో 76శాతం వృద్ధిని సాధించింది. స్థూలలాభం రూ.304 కోట్లు ప్రకటించింది. 3307 కోట్ల రూపాయలు రాబడులు మూడు నెలల్లో సాధించిందని, తొమ్మిదినెలల ఆదాయా నికిగాను 7703కోట్లు సాధించినట్లు వెల్లడించింది. వార్షిక పద్ధతిలో 24శాతం వృద్ధిని సాధించింది. పన్నుల చెల్లిం పులకుముందు మూడవ త్రైమాసికంలో 745కోట్లు సాధిం చింది. వార్షిక పద్ధతిలో 124శాతం పెరిగిందని కంపెనీ వివరించింది. తొమ్మిదినెలల పన్నులచెల్లింపులకు ముందు స్థూల విలువలు 1502 కోట్లుగా ఉన్నాయి. వార్షిక పద్ధతి లో 70శాతం వృద్ధి నమోదు చేసినట్లు కంపెనీ ఎండి సిఇఒ చెపి చలసాని వెల్లడించారు. కరొత్తరోటార్‌బ్లేడ్‌ ప్లాంట్‌లు రాజస్థాన్‌, తమిళనాడులో ప్రారంభించామని, భారత్‌దేశంలో అన్ని విండ్‌రిచ్‌రాష్ట్రాల్లో సుజ్లాన్‌ బలమైన తయారీఉనికికి దోహదంచేస్తుందన్నారు. భారత్‌లో పది వేల మెగావాట్లమైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ సిఇఒ జెపి చలసానివెల్లడించారు. గ్రూప్‌సిఎఫ్‌ఒ కీర్తి పగాడియా మాట్లాడుతూ వృద్ధిచెందిన వ్యాపార సమర్ధతతో పరిమా ణం పరంగా దృఢమైన పురోగతిని అందించినట్లు వెల్లడిం చారు. కంపెనీ రుణభారం 6538 కోట్లకు తగ్గిందని, ఇంతకుముందున్న ట్రిపుల్‌బి రేటింగ్‌ నుంచి మారిందని ఆయన అన్నారు. సుజ్లాన్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు ప్రొవిజినల్‌ ఎ క్రెడిట్‌ రేటింగ్‌ లభించిందన్నారు. కంపెనీ స్థూల లాభం 9.2శాతం చొప్పున పెరిగి 350 కోట్లకు చేరింది. కంపెనీకి కొత్త ఆర్డర్‌బుక్‌ 557 మెగావాట్ల వరకూ ఉంది. ప్రస్తుతం ఉన్న ఆర్డర్‌ బుక్‌ 1231 మెగా వాట్లతో ఉందని వీటి విలువ రూ.7523కోట్లుగా వెల్లడిం చారు. కస్టమర్‌అడ్వాన్సులు రూ.1400 కోట్లవరకూ ఉన్న ట్లు జెపిచలసాని వివరించారు. తెలంగాణలో 210 మెగా వాట్లసౌరవిద్యుత్‌ప్రాజెక్టుల్లో49శాతంపూర్తి చేసామన్నారు.