సిబిడిటి మరో ముందడుగు

INCOME TAX
TAX

సిబిడిటి మరో ముందడుగు

ముంబయి,అక్టోబరు 3: పన్ను ఎగవేతలు నివారించేందుకు సామాజిక మాధ్యమాలను విశ్లేషించాలన్న టార్గెట్‌ సాధించే క్రమంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సిబిడిటి) మరో ముందడుగు వేసింది. అధు నాతన సాంకేతికత సాయంతో, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్య మాలను విశ్లేషించి పన్ను ఎగవేతలకు సంబంధించిన ఆధారాలను గుర్తించేందుకు ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎల్‌ అండ్‌టి గ్రూపులోని సాంకేతిక సంస్థ ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్‌కు 100 మిలియన్‌ డాలర్ల( సుమారు 650 కోట్ల) కాంట్రాక్టును కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి కేటాయించింది. ఈ విషయాన్ని ఎల్‌ అండ్‌ టి ఇన్ఫోటెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజ§్‌ు జలోనా వెల్లడించారు. ఈప్రాజెక్టులో భాగంగా సెమాంటిక్‌ వెబ్‌ను రూపొందిస్తా ్తమని, దీని ద్వారా వెబ్‌ పేజీలను ట్యాగ్‌ చేస్తూ, అందులోని సమాచారాన్ని కంప్యూటర్లే అధ్యయనం చేస్తాయని వివరించారు. అనుమానం ఉన్న వ్యక్తికి సంబంధించి సెమాంటిక్‌ వెబ్‌ రూపొందిస్తే అతని భార్య సీషెల్స్‌ వెళ్లి తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్టు చేసినా వాటిని పట్టేయగలగడం దీని ప్రత్యేకతగా తెలిపారు. ఎల్‌అండ్‌టి నిర్మాణ విభాగాన్ని పూర్తిస్థాయిలో డిజిటలీకరించడం పైన పనిచేస్తున్నట్లు తెలిపారు.