సహారాకు మరో పదిరోజుల గడువు

 Sahara
Sahara

సహారాకు మరో పదిరోజుల గడువు

న్యూఢిల్లీ,జూన్‌ 20: సహారాసెబి వివాదంలో సుప్రీం కోర్టు తాజాగా సహారా చీఫ్‌ సుబ్రతోరా§్‌ుకు మరో పదిరోజులు గడువు ఇస్తూ 709.82కోట్లు జమ చేయాలని ఆదేశించింది. సహారా హామీ ఇచ్చిన రూ.1500 కోట్ల డిపాజిట్‌లో ఈ వాటాను చెల్లించా లని, లేనిపక్షంలో బెయిల్‌ రద్దవుతుందని పేర్కొం ది. అంతేకాకుండా ప్రస్తుతం సహారా బెయిల్‌ను జులై ఐదవ తేదీవరకూ పొడిగించింది.
జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, రంజన్‌ గగో§్‌ులతో కూడిన బెంచ్‌ విచా రణలు వాదనలు విన్నతర్వాత 790.18 కోట్లను ఇప్పటికే జమచేసామని, సెబి సహారా ఖాతాకు జమచేసామన్నారు. మిగిలిన మొత్తం జమచేస్తేందు కు మరో పదిరోజులు వ్యవధికావాలని సహారా న్యాయవాది కపిల్‌ సిబాల్‌ బెంచ్‌ను కోరారు. రా§్‌ు గతంలో రెండు చెక్కులు రూ.1500 కోట్లు జమ చేసారు. 552.22కోట్లు మరో మొత్తం సెబీకి జూన్‌ 15, జూలై 15వ తేదీల్లో చెల్లించాల్సిన వాయిదా లుగా పేర్కొన్నారు. నగదు సకాలంలో జమచేయక పోవడంతో గత ఏప్రిల్‌ 17వ తేదీ సుప్రీంకోర్టు సహా రాకు చెందిన 34వేల కోట్ల ఆస్తులను విక్రయించా లని ఆదేశించింది. మహారాష్ట్రలోని అంబీవ్యాలీ ఆస్తులు జప్తుచేసి ఆసొమ్ము జమచేయాలని కోరింది. గత ఏడాది నవంబరు 28వ తేదీ సుప్రీం రా§్‌ును రూ.600 కోట్లు డిపాజిట్‌ చేయాలని కోరింది.

లేని పక్షంలో జైలుకు మళ్లీ వెళ్లాల్సి ఉంటుందని సూచిం చింది. ఈ ఏడాది మేనెల ఆరవ తేదీ రా§్‌ుకు నాలుగువారాలపెరోల్‌ను మంజూరుచేసింది. రా§్‌ు తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ పెరోల్‌ మంజూరు చేసింది. రా§్‌ుతోపాటు మరో ఇద్దరు డైరెక్టర్లు రవిశంకర్‌ దూబే, అక్ష§్‌ురా§్‌ు చౌదరిలు కూడా రెండు గ్రూప్‌ కంపెనీలపరంగా అరెస్టు అయ్యారు. ఇండియా రియల్‌ఎస్టేట్‌ కార్పొరేషన్‌, సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్ప్‌ డైరెక్టర్లుగా వీరు 24 వేల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్లకు తిరిగి వాపసు ఇవ్వడంలో విఫలం అయినందున సెబీ కేసునమోదుచేసి విచారణచేపట్టడంతో వీరిని కూడా కోర్టు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నారు.

========