సరికొత్త రూపంలో ఉబెర్‌ ఈట్స్‌ యాప్‌

uber eats app
uber eats app

ముంబై: ప్రజలు తాము కోరుకున్న ఆహారాన్ని వారి ఇంటివద్దే అందించడానికి ఉబెర్‌ సంస్థ ప్రవేశపెట్టిన ఈట్స్‌ యాప్‌ సరికొత్త రూపంలో తిరిగి మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సరికొత్త యాప్‌ దేశంలోని అన్ని నగరాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఉబెర్‌ ఈట్స్‌ ఇండియా హెడ్‌ భవిక్‌ రాథోడ్‌ మాట్లాడుతూ ఈ ఏడాదిప్రారంభంలో ఉబెర్‌ ఈట్స్‌ భారతదేశంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి దాని ప్రయాణం ఎంతో గొప్పగా సాగిందని అన్నారు. భారతదేశంలో ఈ తరహా వ్యాపారంలో అగ్రస్థానంలో నిలవాలన్నది తమ లక్ష్యమని కూడా ఆయన చెప్పారు. ఉబెర్‌ ఈట్స్‌ ఈ ఏడాది మేలో తొలి సారిగా ముంబై నగరంలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత హైదరాబాద్‌ సహ మరో ఏడు నగరాలకు విస్తరించింది. ప్రస్తుతం 5వేలకు పైగా రెస్టారెంట్లను కలిగి ఉంది.