సమష్టి కృషితో సమ్మిళిత వృద్ధి

TATA22
TATA Grouup

సమష్టి కృషితో సమ్మిళిత వృద్ధి

ముంబై: టాటాగ్రూప్‌ సంస్థలను సంఘటితవృద్ధితోపాటు మరిం త శక్తివంతమైన గ్రూప్‌గా మార్చడమే తన లక్ష్యంగా టాటాసన్స్‌ కొత్త ఛైర్మన్‌ టిసిఎస్‌ మాజీ సిఇఒ చంద్రశేఖరన్‌ వెల్లడించారు. మంగళవారం టాటాసన్స్‌ తాత్కాలిక ఛైర్మన్‌ రతన్‌ టాటా నుంచి ఆయన కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. నిర్వహణ పనితీరును మరింత మెరుగుపర చుకుని పటిష్టమైన వృద్ధిని కొనసాగేందుకు చూస్తామన్నారు. మూలధన కేటాయింపు విధివిధానాలు, మరింత మెరుగైన రిటర్నులు వాటాదారులకు అందేటట్లు కృషిచేస్తామన్నారు. తన సహచర ఉద్యోగులతో కలిసి సమ్మిళిత వృద్ధికి మరింతగా శ్రమిస్తామని వెల్లడించారు. సహచరులు, మేనేజ్‌మెంట్‌ బృందాలు, గ్రూప్‌ కంపెనీల బోర్డులతో లక్ష్యసాధనకోసం నిర్విరామకృషి చేస్తానని టాటాస్‌ కొత్తఛైర్మన్‌ వెల్లడించారు. టాటాగ్రూప్‌ 150వ వార్షికోత్స వం సమీపిస్తున్న తరుణంలో ఈ గ్రూప్‌ను పర్యవేక్షణ బాధ్యతలు తనకు రావడం అదృష్టంగా ఆయన వెల్లడించారు. మిలియన్లకద్దీ భారతీయుల మనస్సుల్లో టాటాగ్రూప్‌కు ప్రత్యేక ముద్ర ఉన్నదని ఆ ప్రతిష్టను కాపాడు కుంటామని చంద్రశేఖరన్‌ వెల్లడించారు. టాటాసన్స్‌ ఛైర్మన్‌గా ప్రారంభ బోర్డు సమావేశంలో ఛైర్మన్‌గా టాటాపవర్‌, టాటామోటార్స్‌, టాటాస్టీల్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ వంటి వాటిని కూడా పర్యవేక్షిస్తారు. టాటా సంతతికి చెందిన రతన్‌టాటా చంద్రశేఖరన్‌ను టాటాసన్స్‌ ఛైర్మన్‌గా స్వాగతి స్తున్నట్లు వివరించారు. టాటాగ్రూప్‌లో ఇప్పటివరకూ ఆయన అందించిన కీలకసేవలు గుర్తుంచుకోదగినవేనని టాటాగ్రూప్‌ రాను న్న కాలంలో చంద్రశేఖరన్‌ హయాంలో మరింత వృద్ధి చెందగలదని ధీమా వ్యక్తంచేశారు. టాగ్రూప్‌ మిస్ట్రీతో జరిగిన అంతర్యుద్ధం కారణంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీస్థానంలో టాటాసన్స్‌ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను ఎంపిక కమిటీ సిఫారసు లు చేయడంతో బోర్డుఏకగ్రీవంగా ఆమోదించింది. తాత్కాలికఛైర్మన్‌గా వ్యవహ రించిన రతన్‌టాటా చంద్రశేఖరన్‌కు బాధ్యతలు అప్పగించి అభినందించారు.