శాంసంగ్ శుభవార్త

samsung
samsung

తమ వినియోగదారులకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ శుభవార్త అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో కొత్త ఫోన్లను ప్రవేశపెట్టనుంది. జనవరి 28వ తేదీన శాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఎం10, శాంసంగ్ గెలాక్సీ ఎం20, శాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. లీకైన నివేదిక ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎం10 6.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్, 3జీబీ ర్యామ్ ఆప్షన్, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1, 3,4000ఎంఏహెచ్ బ్యాటరీ, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, మైక్రో ఎస్డీకార్డు, మైక్రో యూఎస్బీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది.