శాంసంగ్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

SAMSUNG
SAMSUNG

ముంబై: స్మార్ట్‌ఫోన్‌ల దిగ్గజం శాంసంగ్‌ ఐపిఎల్‌-11 సీజన్‌ సందర్భంగా శాంసంగ్‌ 20-20కార్నివల్‌ను ప్రకటించింది. ఈ కార్నివల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక ధరలను, ఎక్ఛేంజ్‌ ఆఫర్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఈ కార్నివల్‌ను శాంసంగ్‌ ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో నిర్వహిస్తోంది. శాంసంగ్‌ కార్నివల్‌ నేటి (ఏప్రిల్‌ 18) నుంచి ఏప్రిల్‌ 21 వరకు జరగనుంది. కేవలం డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్‌ ఆఫర్లు మాత్రమే కాకుండా ప్రతిరోజు 20 మంది లక్కీ విన్నర్స్‌కి శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ముంబై ఇండియన్స్‌ జెర్సీని కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గెలాక్సీ ఏ8 ప్లప్‌ రూ.29990కు అందుబాటులో ఉంది. రెండు వేల రూపాయల డిస్కౌంట్‌ ప్రకటించిన తర్వాత గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ 32 వేరియంట్‌ రూ.10,990కే విక్రయానికి లభ్యమవుతోంది. అలాగే గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ 64 జిబి వేరియంట్‌పై కూడా 2 వేల రూపాయల డిస్కౌంట్‌ ప్రకటించింది. దీంతోద ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.12,990కి తగ్గింది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్ఛేంజ్‌ చేసుకుని గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ కొనేవారికి అదనంగా మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్‌ లభించనుంది.

వీటితోపాటు శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌7 ప్రో, ఆన్‌5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లు కూడా ప్రత్యేక ధరలు రూ.6,990కు, రూ.6,490కు లభిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌కి ప్రధాన స్పాన్సర్‌ అయిన శాంసంగ్‌ ఈ ఐపిఎల్‌ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ప్రియులకు ఆనందాన్ని పంచడానికి అమెజాన్‌లో ఈ కార్నివల్‌ను నిర్వహిస్తున్నట్లు శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ సందీప్‌ సింగ్‌ అరోరా తెలిపారు. అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ నూర్‌ పటేల్‌ మాట్లాడుతూ అమెజాన్‌లో నిర్వహిస్తున్న శాంసంగ్‌ కార్నివల్‌ దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్‌ వినియోగదారులకు పునరుత్తేజాన్ని కలిగించనుందని తెలిపారు. ఈ క్రికెట్‌ సీజన్‌లో వినియోగదారులు కేవలం శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లను, డిస్కౌంట్లను మాత్రమే కాక వారి అభిమాన ముండై ఇండియన్స్‌ జట్టు అధికారిక జెర్సీని కూడా పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్నివల్లో కొనుగోలుదారులకు డిస్కౌంటు ఆఫర్లు మాత్రమే కాకుండా మరిన్ని ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసపిన ఫోన్లపై ఎంపిక చేసిన క్రెడిట్‌/డెబిట్‌కార్లుపై నో కాస్ట్‌ ఇఎమ్‌ఐ ఆఫర్‌ను కూడా శాంసంగ్‌ ప్రకటించింది.