శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ల్‌పై భారీ డిస్కౌంట్‌

SAMSUNG
SAMSUNG

ముంబై: తమ కస్టమర్లకు అమెజాన్ ఇండియా తీపికబురు అందించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2018 సేల్ పేరుతో అమెజాన్ సరికొత్త డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్9, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, శాంసంగ్ గెలాక్సీ ఏ8 ప్లస్‌తోపాటు మరికొన్ని ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఫోన్ రూ.42,990, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫోన్ రూ. 30,700, శాంసంగ్ గెలాక్సీ ఏ8 ప్లస్ ఫోన్ 23,990 అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎస్‌బీఐ క్రిడెట్, డెబిట్ ద్వారా అమెజాన్ ఇండియాలో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తోందని అమెజాన్ ఇండియా పేర్కొంది.