వైద్యఆరోగ్యరంగానికి కేటాయింపులు పెంచాలి

3
అపోలో షుగర్‌ సిఇఒ గగన్‌ భల్లా

వైద్యఆరోగ్యరంగానికి కేటాయింపులు పెంచాలి
-అపోలో షుగర్‌ సిఇఒ గగన్‌భల్లా

హైదరాబాద్‌, జనవరి 27: మరో నాలుగు రోజుల్లో వస్తున్నకేంద్ర బడ్జెట్‌లో హెల్త్‌కేర్‌ రంగానికి ఎక్కువ కేటాయిం పులు అవసరమని అన్నారు. డిజిటల్‌ కరెన్సీ, తక్కువ పన్నులు, రెరా ఇతర కీలక కార్యాచరణ లుప్రభుత్వ పరంగా ఉంటాయని భావిస్తున్నట్లు అపోలో షుగర్‌ సిఇఒ గగన్‌ భల్లా వెల్లడించారు. అలాగే హెల్త్‌కేర్‌ రంగానికి కూడా సమృద్ధిగా నిధులు అవసరం అవుతాయన్నారు. అత్య వసరమందులు, అంతర్జాతీయ యోగడే వంటి కార్యకలా పాలతో వైద్యానికి ప్రాముఖ్యతేర్పడిందన్నారు. భారత్‌ జిడిపి వృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం అవసరమని అంటువ్యాధులు వ్యాప్తి కారణంగా భారత్‌కు 2030 నాటికి 6.2లక్షల కోట్ల డాలర్లు అవసరం అవుతాయన్న అధ్యయ నాల మేరకు ప్రభుత్వం బడ్జెట్‌లో సముచిత కేటాయిం పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పర్యా వరణ కాలుష్యం పరంగా భారత్‌ మధుమేహానికి హబ్‌గా మారుతోందని, చైనా తర్వాత మధుమేహంలో రెండో స్థానంలో భారత్‌ ఉందని అందువల్లనే ఆసుపత్రి వైద్యం తప్పనిసరి అవుతున్నదని అన్నారు. బడ్జెట్‌పన్నులపరంగా సెక్షన్‌ 80డిపరిమితులను పెంచాలని, ఏడాదికి పన్ను పరిమితులు మినహాయింపులు కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యఆరోగ్యరంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగ స్వామ్య వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని గగన్‌భల్లా వివరించారు.